Parenting Tఇవి కూడా చదవండి బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా.. వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవితips: ఎప్పుడు వద్దని చెప్పాలి
ABN , Publish Date - Sep 04 , 2025 | 02:38 AM
పిల్లల ప్రవర్తనను సరిదిద్ది వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమనే చెప్పాలి. పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేయడం, ఏ పని చేసినా సమర్థించడం ఆమోదించదగ్గ అంశాలు కావని...
పిల్లల ప్రవర్తనను సరిదిద్ది వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమనే చెప్పాలి. పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేయడం, ఏ పని చేసినా సమర్థించడం ఆమోదించదగ్గ అంశాలు కావని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ‘వద్దు’ అని చెప్పడం తల్లిదండ్రులు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు ఏ సందర్భాల్లో పిల్లలకు వద్దని గట్టిగా చెప్పాలో తెలుసుకుందాం...
పిల్లలు రోడ్డు మీద పరుగెత్తడం, ఎత్తయిన ప్రదేశాలు ఎక్కడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయడం ఎంత ప్రమాదకరమో వివరిస్తూ మరోసారి అలా చేయవద్దని గట్టిగా హెచ్చరించాలి. అప్పుడే పిల్లలు భద్రత నియమాలు అర్థం చేసుకోగల్గుతారు.
పిల్లలు తరచూ చాక్లెట్లు, స్వీట్లు, ఇతరత్రా జంక్ ఫుడ్ కావాలని అడుగుతూ ఉంటారు. వాటివల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి చెబుతూ వద్దని వారించాలి. దీనివల్ల పిల్లలకు పోషకాహారం విలువ తెలుస్తుంది.
పిల్లలు హోంవర్క్ చేయకుండా బయట ఆడుకోవడానికి వెళతామని అడుగుతూ ఉంటారు. ఇంట్లో ఏ చిన్న పని చెప్పినా చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కూడా వద్దని గట్టిగా చెప్పాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేయాలని నచ్చచెప్పాలి. దీంతో పిల్లలు క్రమశిక్షణ, సమయపాలన నేర్చుకుంటారు.
తోటివారిపట్ల అమర్యాదగా వ్యవహరించినా, పెద్దలతో అగౌరవంగా మాట్లాడినా పిల్లలను వద్దని వారించాలి. అందరితో స్నేహభావంతో మెలిగే మంచి ప్రవర్తనను అలవాటు చేయాలి.
తోటి పిల్లల దగ్గర చూసిన ప్రతి ఆటవస్తువూ కావాలని పట్టుబట్టినా, తరచూ మొబైల్ ఫోన్ కావాలని అడిగినా వద్దని గట్టిగా చెప్పాలి. డబ్బు, సమయం విలువను పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించాలి.
పరిమితికి మించి పిల్లలు అల్లరి చేస్తున్నా, కోపంతో వస్తువులు విసిరి వేస్తున్నా, తరచూ చెడు మాటలు మాట్లాడుతున్నా వద్దని గట్టిగా చెప్పాలి. శాంతంగా ఉండడం, సంయమనంగా వ్యవహరించడం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడాన్ని పిల్లలకు నేర్పించాలి.
ఇంట్లో క్రమశిక్షణ నియమాలు పాటించకపోయినా, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నా కూడా వద్దని చెప్పాలి. దీనివల్ల పిల్లలకు హద్దుల్లో ప్రవర్తించడం తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..
వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత