Victoria Inspired Jewelry: వయ్యారాల విక్టోరియా
ABN , Publish Date - Nov 23 , 2025 | 05:41 AM
రాజసాన్ని ఒలికిస్తూ విక్టోరియన్ హారాలు, నెక్లె్‌సలు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. భారీ పెండెంట్లు వీటి ప్రత్యేకత. విభిన్నమైన డిజైన్లతో రూపొందించిన సింగిల్, డబుల్, మల్టీ లేయర్డ్ హారాలను అమ్మాయిలు పోటీపడి మరీ...
రాజసాన్ని ఒలికిస్తూ విక్టోరియన్ హారాలు, నెక్లె్‌సలు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. భారీ పెండెంట్లు వీటి ప్రత్యేకత. విభిన్నమైన డిజైన్లతో రూపొందించిన సింగిల్, డబుల్, మల్టీ లేయర్డ్ హారాలను అమ్మాయిలు పోటీపడి మరీ కొనుక్కుంటున్నారు. ఫంక్షన్లు, పార్టీలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో.. బాలికలు, యువతులే కాదు మధ్య వయసు మహిళలు కూడా విక్టోరియన్ నెక్లె్‌సలు ధరించి సందడి చేస్తున్నారు. అంతలా అన్ని వర్గాలవారినీ ఆకర్షిస్తున్న ఈ విక్టోరియన్ హారాలు, నెక్లె్‌సలపై ఓ లుక్కేద్దామా!
పందొమ్మిదో శతాబ్దంలో బ్రిటిష్ జ్యువెలరీ డిజైన్లకు భారతీయ సంప్రదాయ హస్తకళలను జోడించి సరికొత్త శైలిలో ఆభరణాలను రూపొందించారు. వీటిలో పలు వరుసలతో కూడి హారాన్ని తలపించే నెక్లె్‌సలు బాగా ప్రాచుర్యం పొందాయి. పెద్ద లాకెట్‌తో గ్రాండ్‌గా కనిపించే నెక్లె్‌సను విక్టోరియా రాణి ఇష్టంగా ధరించేవారు. అప్పటినుంచి దీనికి విక్టోరియన్ నెక్లెస్, విక్టోరియన్ హారం అనే పేర్లు స్థిరపడ్డాయి. క్రమంగా దీనికి మ్యాచ్ అయ్యేలా చెవి దిద్దులు లేదా జుంకాలు, పాపిడి బిళ్ల, వడ్డాణం, గాజులు వాడుకలోకి వచ్చేశాయి. పేరులోనే దర్పాన్ని నింపుకున్న ఈ ఆభరణాలను బంగారం, వెండి, బేస్ మెటల్స్‌తో తయారుచేస్తారు. మారుతున్న పోకడలను దృష్టిలో ఉంచుకుని వినూత్నమైన డిజైన్లకు శ్రీకారం చుట్టారు డిజైనర్లు. అరుదైన రత్నాలు, వజ్రాలు, ముత్యాలు, రంగురంగుల బీడ్స్, కుందనాలు, అమెరికన్ డైమండ్స్ ఉపయోగిస్తూ ఆకర్షణీయమైన పెండెంట్లతో విక్టోరియన్ హారాలను రూపొందిస్తున్నారు. ఏదైనా పెద్ద సైజు రత్నం (కెంపు, పచ్చ, నీలం, వజ్రం), ఏనుగు, నెమలి, హంస, వినాయకుడు, అష్ట లక్ష్ములు, రాధా కృష్ణులు, రామ పరివారం లాంటి పెండెంట్లు ఉన్న నెక్లె్‌సలు, హారాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాగే పూల డిజైన్లు, జ్యామితి నమూనాలను కూడా ఆదరిస్తున్నారు.
మల్టీ లేయర్డ్ విక్టోరియన్ హారాలు.. వరుసకో పెండెంట్‌తో చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయి. మెడలో ఈ హారం ఒక్కటి వేసుకుంటే చాలు మరే ఇతర నెక్లెస్, చోకర్, పొడవాటి గొలుసుల అవసరం ఉండదు. పెళ్లి కూతురి అలంకరణలో ఈ విక్టోరియన్ హారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సింగిల్, డబుల్ లేయర్డ్ హారాలు డిజైన్‌ను అనుసరించి సింపుల్ లేదా రిచ్ లుక్ నిస్తుంటాయి. లెహంగాలు, పట్టుచీరలు, లంగా-ఓణీ లాంటి సంప్రదాయ దుస్తులమీద విక్టోరియన్ నెక్లె్‌సలు, హారాలు అందంగా అమరుతాయి.
ఎంతో ఇష్టంగా కొనుక్కున్న విక్టోరియన్ హారాలు, నెక్లె్‌సలు ఎప్పటికీ వన్నె తగ్గకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ సంరక్షించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటికి పెర్ఫ్యూమ్‌లు, మేకప్ లోషన్లు, మేక్‌పను తొలగించే క్లీనర్స్ తగలకుండా చూసుకోవాలి. ముఖాన్ని నీటితో కడుక్కోవాలి అనుకున్నప్పుడు, అధికంగా చెమట పడుతుందనిపించినప్పుడు మెడలోనుంచి నెక్లెస్ లేదా హారం తీయడం మంచిది. ఒకసారి ధరించి తీసిన తరువాత వాటిని మెత్తటి గుడ్డతో నెమ్మదిగా తుడవాలి. తేమ లేదని నిర్ధారించుకున్న తరువాతనే వాటిని ప్లాస్టిక్ లేదా క్లాత్ లైన్డ్ బాక్స్‌ల్లో భద్రపరచుకోవాలి. విక్టోరియన్ ఆభరణాలను వెల్వెట్ బాక్స్‌ల్లో పెట్టకూడదు.
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి