Share News

Trending Handbags: ట్రెండీ హ్యాండ్‌ బ్యాగ్‌లు ఇవే..

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:32 AM

మహిళలు సందర్భానికి తగ్గట్టు రకరకాల హ్యాండ్‌ బ్యాగ్‌లు ఉపయోగిస్తూ ఉంటారు. వేడుకలు, దూర ప్రయాణాలు, కార్యాలయాలకు ..

Trending Handbags: ట్రెండీ హ్యాండ్‌ బ్యాగ్‌లు ఇవే..

మహిళలు సందర్భానికి తగ్గట్టు రకరకాల హ్యాండ్‌ బ్యాగ్‌లు ఉపయోగిస్తూ ఉంటారు. వేడుకలు, దూర ప్రయాణాలు, కార్యాలయాలకు వెళ్లేటప్పుడు అనువుగా ఉండే వేర్వేరు హ్యాండ్‌ బ్యాగ్‌లను తీసుకెళుతూ ఉంటారు. ప్రస్తుతం యువతులను ఆకర్షిస్తూ ట్రెండింగ్‌లో ఉన్న హ్యాండ్‌ బ్యాగ్‌లు ఇవే...

GFJG - Copy.jpg

డఫెల్‌ బ్యాగ్‌

ఇది స్థూపాకారంలో అడ్డంగా ఉంటుంది. వారాంతపు టూర్‌, పిక్నిక్‌, దూర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఈ బ్యాగ్‌ లోపల విశాలంగా ఉండడం వల్ల చాలా వస్తువులను పొందికగా సర్దుకోవచ్చు. ఈ డఫెల్‌ బ్యాగ్‌లు పలు రంగుల్లో ఆకర్షణీయమైన డిజైన్లలో లభ్యమవుతున్నాయి.

GHD - Copy.jpg

టోట్‌ బ్యాగ్‌

ఇది రోజువారీ అవసరాలకు చక్కగా సరిపోతుంది. ఇలాంటి బ్యాగ్‌లను ఎక్కువగా కాలేజీలు, కార్యాలయాలకు వెళ్లే యువతులు, మహిళలు ఉపయోగిస్తున్నారు. క్యాష్‌, కార్డ్‌లు, లంచ్‌ బాక్స్‌, చిన్న టవల్‌, అదనంగా ఒక సంచి లాంటివాటిని ఈ బ్యాగుల్లో చక్కగా సర్దుకోవచ్చు. పొట్టి, పొడుగు బకిల్స్‌తో సులువుగా భుజానికి వేసుకోవడానికి వీలుగా ఉంటాయి.


GGCJ - Copy.jpg

క్లచ్‌

పార్టీలకు, చిన్న ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. అందమైన ఎంబ్రాయిడరీ, లేస్‌, కుందన్‌, మెరిసే రాళ్ల వర్కులతో రిచ్‌గా కనిపిస్తుంటాయి. బంగారు, వెండి రంగుల్లో ఉండే క్లచ్‌లను యువతులు ఇష్టంగా కొనుక్కుంటున్నారు. శాటిన్‌ క్లాత్‌తో రూపొందించిన క్లచ్‌లకు కూడా డిమాండ్‌ అధికంగానే ఉంది. క్లచ్‌లో కొద్దిగా క్యాష్‌, మొబైల్‌, చిన్న లిప్‌స్టిక్‌, మాయిశ్చరైజర్‌ మాత్రమే పడతాయి.

HMJ - Copy.jpg

బ్యాక్‌ ప్యాక్‌

ఇవి చూడడానికి స్టయిల్‌గా కనిపిస్తుంటాయి. కాలేజీలకు, చిన్నపాటి విహారయాత్రలకు వేళ్లేటప్పుడు తీసుకెళ్లడానికి అనువుగా ఉంటాయి. ఫ్యాన్సీ ప్రింట్లతో ట్రెండీగా ఉంటూ ఇవి యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 04:32 AM