Share News

Traditional Jewelry: గజ్జె ఘల్లుమన్నది

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:18 AM

సంప్రదాయ వేడుకల్లో తెలుగుతనం ఉట్టిపడాలంటే ఇతరత్రా ఆభరణాలతో పాటు పాదాలకు ‘పాయల్‌’ కూడా ధరిస్తూ ఉండాలి. వాటిలో తాజాగా మగువల మనసులను దోచుకుంటున్న డిజైన్లు, మోడల్స్‌ ఇవే!

 Traditional Jewelry: గజ్జె ఘల్లుమన్నది

వెండి వెలుగులు: మువ్వల పట్టీలు అనగానే కళ్లముందు వెండి పట్టీలే మెదులుతాయి. అయితే తాజాగా పాత కాలంనాటి వెడల్పాటి పట్టీల ట్రెండ్‌ మళ్లీ పునరావృతమైంది. కాబట్టి ఒకటిన్నర అంగుళం వెడల్పు ఉండే పట్టీలు ఎంచుకోవాలి. ఆక్సిడైజ్‌ చేసినవైనా, చేయనివైనా ఫరవాలేదు. మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎనామిల్‌ లేదా రాళ్లు పొదిగిన పట్టీలు ఎంచుకుంటే చాలు!

ఆధునిక అలంకరణ: ఆధునిక వస్త్రధారణకు కాలి పట్టీల అలంకరణ నప్పదేమో అనుకోవలసిన అవసరం లేదు. ఇలాంటి దుస్తులకు నప్పేలా ‘సింగిల్‌ చైన్‌ యాంక్లెట్స్‌’ కూడా తయారవుతున్నాయి. సన్నగా, మెరుపులీనే నగిషీలతో కూడిన ఈ రకం పట్టీలు ఎంతో సొగసుగా కనిపిస్తాయి. 10 నుంచి 25 గ్రాముల బరువులో దొరికే ఈ పట్టీలు కొనేటప్పుడు లింకులు బలంగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి. అలాగే రెండు చివర్లూ కలిపే కొక్కెం ధృడంగా ఉండేలా చూసుకోవాలి.

ముత్యాల పట్టీలు: మధ్యస్తంగా ఉండే ముత్యాలతో తయారయ్యే ఈ రకం కాలి పట్టీలు నేటి తరం అమ్మాయిలకు చక్కగా నప్పుతాయి. ముత్యాల మధ్యలో వెండి లేదా బంగారంతో తయారైన గుండ్లు జోడించి తయారుచేసే ఈ పట్టీలు అటు సంప్రదాయ వేడుకలకూ, ఇటు ఆధునిక విందు వినోదాల్లో ధరించడానికి అనువుగా ఉంటాయి.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 04:18 AM