Share News

Tips for a Peaceful Nights Sleep: హాయిగా నిద్ర పట్టాలంటే

ABN , Publish Date - Oct 30 , 2025 | 02:38 AM

ఎలాంటి ఆలోచనలు, ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు. అలా హాయిగా నిద్ర రావాలంటే పడుకునేముందు ఏ జాగ్రత్తలు...

Tips for a Peaceful Nights Sleep: హాయిగా నిద్ర పట్టాలంటే

ఎలాంటి ఆలోచనలు, ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు. అలా హాయిగా నిద్ర రావాలంటే పడుకునేముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...

  • చాలామంది పడుకునేముందు కుటుంబ సమస్యలు, ఆర్థిక వ్యవహారాలు, ఆఫీసు పని తదితరాల గురించి ఆలోచిస్తుంటారు. ఇలాచేయడం వల్ల మనసంతా ఆందోళనలతో నిండి నిద్ర కరవవుతుంది. అలాకాకుండా పడుకునేముంది ఆ రోజు జరిగిన సంతోషకరమైన సంఘటనలను లేదా జీవితంలో సాధించిన విజయాలను ఒకసారి గుర్తు చేసుకుంటే మనసంతా సంతోషంతో నిండుతుంది. వెంటనే నిద్ర వచ్చేస్తుంది కూడా.

  • పడుకునేముందు సామాజిక మాధ్యమాల్లో గడపడం వల్ల తెలియకుండానే సమయం మించిపోతుంటుంది. దీనివల్ల నిద్ర సరిపోక కళ్లు మండడం, తలనొప్పి, అలసట తీరకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. రాత్రి పడుకోవడానికి గంట ముందు నుంచే ఫోన్‌, టీవీలను చూడడం మానేయాలి. సాధ్యమైనంత వరకూ స్ర్కీన్‌ సమయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది.

  • రాత్రి భోజనాన్ని త్వరగా ముగించాలి. నూనె పదార్థాలు, మసాలాలతో నిండిన ఆహారం కాకుండా తేలికగా జీర్ణమయ్యే వాటిని మాత్రమే మితంగా తినాలి. కడుపులో తేలికగా ఉంటే హాయిగా నిద్ర పడుతుంది. పడుకోవడానికి అరగంట ముందు గోరువెచ్చని పాలు తాగితే వెంటనే నిద్ర ముంచుకొస్తుంది.

  • పడక గది ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంతవరకూ ఎక్కువ వెలుతురు లేకుండా గదిని చీకటిగా ఉంచుకుంటే చక్కగా నిద్ర పడుతుంది. పడకగదిలో ఫోన్‌కు బదులు గడియారంలో అలారం సెట్‌చేసుకోవడం మంచిది.

  • రోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకుంటే రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..

మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు

Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..

Updated Date - Oct 30 , 2025 | 02:38 AM