Share News

ఆంత్రప్రెన్యూర్‌ కావడానికీ కోర్సులు ఉన్నాయి

ABN , Publish Date - Feb 24 , 2025 | 06:03 AM

ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి. ‘ఆంత్రప్రెన్యూర్‌షిప్‌’ కరిక్యులమ్‌లో భాగమైతేనే ఇది సాధ్యం. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌లో ఆంత్రప్రెన్యూర్‌..

ఆంత్రప్రెన్యూర్‌ కావడానికీ కోర్సులు ఉన్నాయి

ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి. ‘ఆంత్రప్రెన్యూర్‌షిప్‌’ కరిక్యులమ్‌లో భాగమైతేనే ఇది సాధ్యం. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌లో ఆంత్రప్రెన్యూర్‌ మైండ్‌సెట్‌ అభివృద్ధి అవుతుందనే ఆలోచనతో హైదరాబాద్‌ ఐఐటీ ‘ఇన్నోవేషన్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌’ స్కూల్‌ను ప్రారంభించింది. అదే బీవీఆర్‌ సైయెంట్‌ (బీవీఆర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌). భారతదేశంలో ఆంత్రప్రెన్యూర్‌షిప్‌పై ప్రత్యేక స్కూల్‌ ఇది ఒక్కటే. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్యను పెంచడం, అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడం, అవసరమైన వాతావరణాన్ని ఏర్పడరచడం లక్ష్యాలుగా 2024 జనవరిలో దీనిని ఏర్పాటు చేశారు.

  • ఇక్కడ ఫార్మల్‌ డిగ్రీలు కాకుండా ఇన్నోవేషన్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌పై షార్ట్‌టర్మ్‌ కోర్సులు అందిస్తారు. వీటికి సంబంధించి ఇంజనీరింగ్‌ వంటి కాలేజీలకు, కార్పొరేట్‌ సంస్థలకు వెళ్లి అవగాహన కల్పిస్తారు. ఆలోచనలు అవకాశాలుగా, బిజినె్‌సగా ఎలా మలచాలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలు, ఐఐటీ ఫ్యాకల్టీలు ఇక్కడ శిక్షణ ఇస్తారు. దీనితోపాటు టీహబ్‌, ఇతర ఇన్నోవేషన్‌ సెంటర్‌లతో కలిసి వర్క్‌ చేస్తున్నారు.


కోర్సులు: ప్రస్తుతం బీవీఆర్‌ సైయెంట్‌ కొన్ని కోర్సులను ఆఫర్‌ చేస్తోంది. ‘ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ డిజిటల్‌ ఎరా’ కోర్సు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. త్వరలో ‘డిజిటల్‌ ఆంటర్‌ ప్రైజెస్‌’, ‘ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ ఆంత్రప్రెన్యూర్స్‌’ తదితర కోర్సులు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం బీవీఆర్‌ సైయొంట్‌ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Address: BVR SCIENT, IIT- Kandi, Sangareddy, Telangana– 502284 Mobile: +91 9160006190, https://bvrscient.iith.ac.in/

Updated Date - Feb 24 , 2025 | 06:03 AM