Share News

Ganesh Immersion: నిమజ్జనం ఎందుకంటే..

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:27 AM

భాద్రపద శుద్ధ చవితిని అనంత చతుర్దశి అంటారు. దీనికి ఒక విశేషం ఉంది. ఆ రోజే వినాయకుణ్ణి నీటిలో నిమజ్జనం చేస్తాం...

Ganesh Immersion: నిమజ్జనం ఎందుకంటే..

భాద్రపద శుద్ధ చవితిని ‘అనంత చతుర్దశి’ అంటారు. దీనికి ఒక విశేషం ఉంది. ఆ రోజే వినాయకుణ్ణి నీటిలో నిమజ్జనం చేస్తాం. వినాయక చవితి నాడు మట్టి ప్రతిమను ప్రతిష్ఠించి, పదిరోజుల పాటు పూజలు నిర్వహించిన తరువాత... దాన్ని నదిలో కానీ, సముద్రంలో కానీ కలపడానికి కారణం ఏమిటంటే... పూజలు అందుకున్న వినాయకుడి శక్తులు ఆ నీటి ప్రవాహం ద్వారా సర్వత్రా వ్యాప్తి చెందుతాయి.


ఆ విధంగా శ్రీగణేశుని శక్తులు, తత్త్వం అయిన పవిత్రత, వివేకం, అభోదితత్వం, విచక్షణ, తల్లిపట్ల సమర్పణ భావం ఆ అనంతమైన నీటిలో స్థిరపడి ప్రవహిస్తూ సముద్రాన్ని చేరుకుంటాయి. ‘అనంత’ అంటే వినాయకుడు, నాశనం లేనివాడు. గణేశుని శక్తి అనంతంగా వ్యాపించి ఉంటుంది. అంతటి మహిమాన్వితుణ్ణి నిమజ్జనం చేయడానికి తీసుకువెళుతున్నప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో మెలగాలి. కీర్తనలు పాడుతూ మేళ తాళాలతో, మంగళప్రదంగా ఆయనను సాగనంపాలి.


భూమాతను గణేశుని తల్లిగా, హిమాలయాలను ఆయన తండ్రి అయిన శివునిగా, సముద్రుణ్ణి ఆయన తాతగారిగా భావించే సంప్రదాయం ఉంది. ‘అనంతుడు’ అనే పేరు ఉన్న ఆయనను అనంత చతుర్దశి రోజున సముద్రంలో లేదా నదులు, చెరువుల్లో నిమజ్జనం చేయడానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మట్టినుంచి ఉద్భవించిన గణేశుడు నీటిలోకి చేరి, దాని ద్వారా మానవాళికి, జంతువులకు, ప్రకృతికి తన శక్తులను, తత్త్వాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి నిమజ్జనం కార్యక్రమాన్ని గౌరవప్రదంగా, ఒక పుణ్యకార్యంగా నిర్వహించుకోవాలి.


ఇవి కూడా చదవండి

జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ ఖాయం:రఘురామ

లేదులేదు.. ఆయన్ని నేనేం విమర్శించలేదు..

Updated Date - Sep 05 , 2025 | 01:32 PM