Share News

Neeti Shatakam : ఫలితాలు ఇచ్చేది అదే!

ABN , Publish Date - Feb 06 , 2025 | 10:41 PM

జీవితంలో మంచి ఫలితాలు పొందడానికి పూర్వ పుణ్యాలే కారణమవుతాయని తన ‘నీతి శతకం’లోని ఈ శ్లోకంలో భర్తృహరి వర్ణించాడు. దాన్ని...

Neeti Shatakam : ఫలితాలు ఇచ్చేది అదే!

నైవాకృతిః ఫలతి నైవ కులం న శీలం

విద్యాపి నైవ న చ యత్న కృతాపి సేవా

భాగ్యాని పూర్వతపసా ఖలు సంచితాని

కాలే ఫలంతి పురుషస్య యథైవ వృక్షాః..

జీవితంలో మంచి ఫలితాలు పొందడానికి పూర్వ పుణ్యాలే కారణమవుతాయని తన

‘నీతి శతకం’లోని ఈ శ్లోకంలో భర్తృహరి వర్ణించాడు. దాన్ని...

రమ్యరూపంబు, విద్యయు, రాజసేవ

కులము శీలంబు జాలవు ఫల మొసంగ

బూర్వపుణ్య సంచిత భాగ్యములు ఫలించు

గాలమున బనసాది వృక్షముల కరణి...

అనే పద్యరూపంలో ఏనుగు లక్ష్మణకవి తెలుగువారికి అందించాడు.

భావం: అందమైన రూపం, ఉన్నతమైన విద్య, గొప్ప కులం, మంచి నడవడిక, అధికారంలో ఉన్నవారి ఆశ్రయం... ఇవేవీ మనిషికి గొప్ప ఫలితాలను ఎల్లప్పుడూ ఇవ్వలేవు. కొన్నిసార్లు వాటివల్ల ప్రయోజనం ఉండదు. పూర్వం చేసిన పుణ్యం వల్ల మాత్రమే కర్మ ఫలం లభిస్తుంది. చెట్లు నాటిన తరువాత... అవి పెరిగి పెద్దవై, పండ్లు కాయడానికి సమయం పడుతుంది. అలాగే తగిన కాలం వచ్చినప్పుడే పూర్వ పుణ్యాల వల్ల ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి ఎప్పుడూ పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. వాటి వల్ల ఫలితం భవిష్యత్తులో తప్పకుండా ఉంటుంది.

Updated Date - Feb 06 , 2025 | 10:41 PM