Share News

బహుముఖ బనారస్‌!

ABN , Publish Date - Feb 14 , 2025 | 02:55 AM

కాశీ.. వారణాసి... బనారస్‌... ఏ పేరుతో పిలుచుకున్నా- హిందువులు జీవితంలో ఒక్క సారైనా దర్శించాలనుకొనే నగరమది. అయితే కాశీకి వేల రూపాలున్నాయి. కాశీ ఒక ధార్మిక నగరం. దాన్ని ‘విష్ణు నగరం’, ‘శివ నగరం’, ‘బుద్ధ నగరం’గా విభజించుకోవచ్చు...

బహుముఖ బనారస్‌!

వ్యాసపీఠం

కాశీ.. వారణాసి... బనారస్‌...

ఏ పేరుతో పిలుచుకున్నా- హిందువులు జీవితంలో ఒక్క సారైనా దర్శించాలనుకొనే నగరమది. అయితే కాశీకి వేల రూపాలున్నాయి. కాశీ ఒక ధార్మిక నగరం. దాన్ని ‘విష్ణు నగరం’, ‘శివ నగరం’, ‘బుద్ధ నగరం’గా విభజించుకోవచ్చు. ఈ మూడింటిలోను వేల దేవాలయాలు మనకు కనిపిస్తాయి. కాశీ ఒక పండుగల నగరం. అక్కడ ఉత్సవం జరగని వీధి లేదు. ఊరేగింపు వెళ్లని రోజు లేదు. శ్మశానంలో కూడా ‘హోలీ’ (మసాన్‌ హోలీ) ఆడే నగరం మనకెక్కడా కనిపించదు. కాశీ సాంస్కృతిక నగరం. అది సంగీత, నృత్యాల సంగమ స్థలం. ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన ధర్మాన్ని ఆధునికతతో మేళవించిన అద్భుత నగరం కాశీ. అందుకే ఒక కవి - ‘‘న భూఖా బనారస్‌... న నంగా బనారస్‌... సదా మస్త్‌ చంగా రహా హై బనారస్‌’’ (బనారస్‌కు దారిద్య్రం లేదు, ఎప్పుడూ దిగంబరం కాదు, బనారస్‌ ఎప్పుడూ యవ్వనంగా సంతోషంగా ఉంటుంది) అంటాడు. ఇలా కాశీకి చెందిన రకరకాల పార్శ్వాలను ఐపీఎస్‌ అధికారి, కవి రమా సత్యనారాయణ- ‘బహుముఖ బనారస్‌’ అనే పుస్తకంలో ఆవిష్కరించారు. సరళమైన తెలుగులో, అందమైన వచనంలో రాసిన ఈ పుస్తకాన్ని వారణాసిపై ఆసక్తి ఉన్న వారందరూ తప్పనిసరిగా చదవాలి.

బహుముఖ బనారస్‌

రచయిత: రమా సత్యనారాయణ

ప్రచురణ: మిసిమి

ప్రతులకు: 9949516567


ఇవి కూాడా చదవండి..

Kamal Haasan: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Maha Kumbh Mela 2025: మాఘపూర్ణిమ సందర్భంగా కుంభ మేళాకు పోటెత్తిన భక్తజనం.. 6 గంటల నాటికి 73.60 లక్షల మంది

Kejriwal: పంజాబ్‌ సీఎంగా కేజ్రీవాల్‌?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2025 | 02:55 AM