Share News

The Ratnagarbha Ganapati: ఈ గణపతి రత్నగర్భుడు

ABN , Publish Date - Dec 12 , 2025 | 02:07 AM

‘గణ’ అంటే సమూహం లేదా సైన్యం. ‘నాథుడు’ అంటే అధిపతి లేదా నాయకుడు. గణనాథుడు అంటే దేవతల సమూహానికి అధిపతి... వినాయకుడు. ఆయనను విఘ్నాలకు అధిపతిగా భావిస్తారు. ఏదైనా పని...

The Ratnagarbha Ganapati: ఈ గణపతి రత్నగర్భుడు

ఆలయ దర్శనం

‘గణ’ అంటే సమూహం లేదా సైన్యం. ‘నాథుడు’ అంటే అధిపతి లేదా నాయకుడు. గణనాథుడు అంటే దేవతల సమూహానికి అధిపతి... వినాయకుడు. ఆయనను విఘ్నాలకు అధిపతిగా భావిస్తారు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆయనను పూజిస్తే అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఆ స్వామి ఆంధ్రప్రదేశ్‌లోని రాయభూపాలపట్నంలో రత్నగర్భ గణపతిగా ఆయన కొలువయ్యాడు.

ఉత్తరాభిముఖంగా...

ప్రస్తుతం రత్నగర్భ గణపతి ఆలయ ఉన్న ప్రాంతం నుంచి సుమారు కిలోమీటరు దూరంలో... దాదాపు 150 ఏళ్ళ క్రితం రెండు విగ్రహాలు బయటపడ్డాయి. వాటిలో ఒక దాన్ని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలో రెండోదాన్ని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో ఉన్న రంగాపురం గ్రామంలో ప్రతిష్ఠించారని తెలుస్తోంది. అప్పట్లో ఈవిగ్రహం తరలించడానికి సుమారు వారం రోజుల సమయం పట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది దాదాపు 500 సంవత్సరాల క్రితం పాలించిన చాళుక్యుల కాలం నాటి విగ్రహం అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. చెరువులోనుంచి విగ్రహం బయటపడిన తరువాత అక్కడే ఆలయాన్ని నిర్మించారు. నాటినుంచి నేటి వరకూ గణనాథుడు నిత్యం ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ఆ గణపతిని గర్భంలో రత్నాలను దాచుకున్న ‘రత్నగర్భ గణపతి’గా, ‘లక్ష్మీగణపతి’గా కొలుస్తున్నారు. రత్నాలవంటి అమూల్యమైన కరుణ, జ్ఞానం, ఐశ్వర్యాలను తన ఉదరంలో ధరించిన వేలుపు రత్నగర్భ గణపతి అని, పైకి సైకత శిల్పంలలా కనిపించే ఈ స్వామిని సేవిస్తే సమస్త సంకటాలు, సర్వపాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. సాధారణంగా తూర్పు ముఖంగా దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉత్తర ముఖంగా శ్రీరత్నగర్భ గణపతి స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

వినాయక్‌ నర్లజర్ల , పెద్దాపురం

ఇవీ చదవండి:

వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీపై అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తలు.. ఆమె సూపర్ స్టార్ అంటూ..

మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన

Updated Date - Dec 12 , 2025 | 02:07 AM