సన్ స్క్రీన్ స్టిక్స్ వచ్చేశాయ్..
ABN , Publish Date - Jul 06 , 2025 | 01:31 PM
సౌందర్య పోషణలో ‘సన్ స్క్రీన్’ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చర్మ సంరక్షణలో అత్యంత కీలకం ఇదే. సూర్యరశ్మి తగిలి చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే ‘సన్‌స్ర్కీన్’ ఒక్కటే మార్గం. ఇప్పటిదాకా లోషన్, క్రీమ్‌గానే లభిస్తే... మార్కెట్లోకి సరికొత్తగా ‘స్టిక్స్’ కూడా వచ్చేశాయి.

సౌందర్య పోషణలో ‘సన్ స్క్రీన్’ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చర్మ సంరక్షణలో అత్యంత కీలకం ఇదే. సూర్యరశ్మి తగిలి చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే ‘సన్‌స్ర్కీన్’ ఒక్కటే మార్గం. ఇప్పటిదాకా లోషన్, క్రీమ్‌గానే లభిస్తే... మార్కెట్లోకి సరికొత్తగా ‘స్టిక్స్’ కూడా వచ్చేశాయి. ఇంతకీ దీనితో ప్రయోజనాలేంటీ?
తేడా ఇదీ...
ఫచాలా ఏళ్ల నుంచి ఉన్న సంప్రదాయ లోషన్లు, క్రీములు మాదిరిగానే ‘సన్‌స్ర్కీన్ స్టిక్’లు వాటిలోని పదార్థాలతోనే తయారవుతాయి. కాకపోతే ఫార్మాట్ వేరు. అవి ద్రవంలా ఉంటే... ఇది కాస్త గడ్డకట్టినట్టుగా, లిప్‌స్టిక్‌లా ఉంటుంది.
- సాధారణంగా మేకప్ వేసుకున్నాక... అవసరమైనప్పుడు సన్‌స్ర్కీన్ లోషన్ రాసుకోవడానికి కుదరదు. కానీ స్టిక్‌తో ఆ ఇబ్బందేమీ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు.
- లోషన్ రాసుకున్నాక చర్మం కాస్త జిడ్డుగా కనిపిస్తుంది. అయితే స్టిక్‌తో అలాంటి సమస్య ఉండదు.
ఎంత వాడాలి?
- సాధారణంగా ముఖానికి 2 మి.గ్రా. సన్‌స్ర్కీన్ అవసరం అవుతుంది. అయితే స్టిక్‌తో అప్లై చేసేటప్పుడు దాన్ని కొలిచేదెలా అనే సందేహం రావొచ్చు. అందుకే ముఖం అంతటా నాలుగుసార్లు ఈ స్టిక్‌తో సుతి మెత్తగా రుద్దితే తగినంత సన్‌స్ర్కీన్ ముఖానికి అందినట్లే అంటున్నారు సౌందర్య నిపుణులు.
ప్రయోజనాలివి...
- దీనిని రాసుకోవడం చాలా తేలిక. చేతివేళ్లు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా నేరుగా చర్మానికి అప్లై చేసుకోవచ్చు. ముక్కు, కళ్లు, చెవులు వంటి సున్నితమైన భాగాలకూ సింపుల్‌గా రాసుకోవచ్చు.
- ఇవి చిన్నగా, తక్కువ బరువుతో ఉంటాయి. లీకేజీ సమస్య ఉండదు. జేబులో లేదా చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో సులభంగా సరిపోతాయి. ప్రయాణ సమయంలో అనుకూలమైనవి. కావాలంటే బ్యాగ్ చార్మ్‌గా కూడా వీటిని ఉపయోగించొచ్చు.
- హైకింగ్, బీచ్ ఔటింగ్స్, స్పోర్ట్స్ వంటి బహిరంగ కార్యకలాపాల సమయంలో టచప్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి.
గుర్తుంచుకోవాల్సినవి...
- మార్కెట్‌లో చాలా రకాలున్నాయి. ఏది వాడితే మేలు అంటే.. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉండాలి. ఎస్‌పీఎఫ్ 40కి పైగా ఉంటే మంచిది. వాటర్ రెసిస్టెన్స్ ఉందా? అన్నది చూసుకోవాలి.
- ఒక్కసారి రాసుకున్నాం కదా అని వదిలేయకుండా ప్రతీ రెండు గంటలకోసారి సన్‌స్ర్కీన్ రాసుకోవడం ముఖ్యం.
- మగవారి కోసం స్పోర్ట్స్ సన్‌స్ర్కీన్ స్టిక్‌లు అందుబాటులో ఉన్నాయి.
- సన్‌స్ర్కీన్ స్టిక్స్‌లో.. సాధారణంగా తక్కువ ప్రిజర్వేటివ్‌లు, ఆల్కహాల్ ఉంటాయి. అలాగే పర్యావరణ అనుకూలమైన నాన్- ఏరోసోల్ ప్యాకేజింగ్‌లో ఇవి లభిస్తున్నాయి.
ఏ చర్మానికి ఏది?
- పొడి చర్మం ఉంటే.. షియాబటర్, ఆయిల్ వంటి మాయిశ్చరైజింగ్ పదార్థాలున్న స్టిక్స్‌ను ఎంచుకోవడం బెటర్.
- సున్నిత చర్మం అయితే.. మినరల్ బేస్డ్ సన్‌స్ర్కీన్ సరైన ఎంపిక. వీటిలో తక్కువ ఆల్కహాల్ ఉంటుంది.
- హైకింగ్ లేదా ప్రయాణ సమయంలో టచప్ కోసం కాంపాక్ట్ స్టిక్ సరైనది.
- ఎండలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తే.. వాటర్‌ప్రూఫ్ స్టిక్ ఉపయోగించడం ఉత్తమం.
వీటితో చర్మ సంరక్షణ
- జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్... ఈ మినరల్ ఆధారిత పదార్థాలు చర్మానికి యూవీ రక్షణను అందిస్తాయి.
- హైడ్రేటింగ్ పదార్థాలు (షియా బటర్ లేదా హైలురోనిక్ యాసిడ్ వంటివి)... చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారకుండా కాపాడతాయి.
- బ్రాడ్‌స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్.. యూవీఏ, యూవీబీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది. చర్మ క్యాన్సర్, వృద్ధాప్య ఛాయలు, చర్మంపై గీతలు రాకుండా కాపాడుతుంది.
- యాంటీ ఆక్సిడెంట్స్ (విటమిన్ ఇ, సి వంటివి).. ఫ్రీ రాడికల్స్ వల్లకలిగే నష్టం నుంచి రక్షణ కల్పిస్తాయి.