Share News

Health Benefits: అనాస పువ్వుతో...

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:50 AM

బిరియానిలో వాడుకునే అనాస పువ్వుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Health Benefits: అనాస పువ్వుతో...

అవేంటంటే....

ఇన్‌ఫెక్షన్లు: అనాస పువ్వులోని షికిమిక్‌ ఆమ్లం, అనెథోల్‌, లినలూల్‌ సమ్మేళనాలు బ్యాక్టీరియాతో పోరాడడంతో పాటు పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. దాంతో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, న్యుమోనియా దరి చేరకుండా ఉంటాయి

ఫంగ్‌సకు వ్యతిరేకంగా: అనెథోల్‌, లినలూల్‌ అనే ఫ్లేవనాయిడ్లు ఫంగస్‌ పెరుగుదలను అడ్డుకుంటాయి.

వైర్‌సకు వ్యతిరేకంగా: టామిఫ్లూ లాంటి యాంటీవైరల్‌ మందుల తయారీలో అనాస పువ్వులోని షికిమిక్‌ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు

మధుమేహం: అనాస పువ్వులోని అనెథోల్‌, పిండిపదార్థాలు శక్తిగా మారే ప్రక్రియకు దోహదపడుతూ, రక్తంలో చక్కెర మోతాదును సమంగా ఉంచుతుంది.


యాంటీఆక్సిడెంట్లు: అనాస పువ్వులోని యాంటీఆక్సిడెంట్లు కణ నష్టాన్ని నివారిస్తాయి. ఫలితంగా కణుతులు పెరిగే అవకాశాలు తగ్గుతాయిని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అజీర్తి: కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గించే స్వభావం అనాస పువ్వుకు ఉంటుంది.

ఇన్ని సుగుణాలు కలిగిన అనాస పువ్వును తరచూ వంటకాల్లో వాడుకోవడం వాడుకోవడం ఆరోగ్యకరం. సాస్‌ తయారీలో, సూప్‌ తయారీలో, మాంసాహార వంటకాల్లో విరివిగా వాడుకోవచ్చు.


ఇవి కూడా చదవండి..

Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు

Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?

Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్‌ బోర్డుకు తారు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2025 | 03:50 AM