Diabetes Monitoring Devices: మధుమేహం మన చేతుల్లో
ABN , Publish Date - Jul 15 , 2025 | 01:49 AM
ఆధునిక వైద్యం విప్లవాత్మకమైన అభివృద్ధి సాధిస్తోంది. ఈ క్రమంలో మధుమేహానికి కూడా కొత్త మందులు, పరికరాలు అందుబాటులోకొచ్చాయి. వాటి గురించి అవగాహన పెంచుకుందాం...
చికిత్స
ఆధునిక వైద్యం విప్లవాత్మకమైన అభివృద్ధి సాధిస్తోంది. ఈ క్రమంలో మధుమేహానికి కూడా కొత్త మందులు, పరికరాలు అందుబాటులోకొచ్చాయి. వాటి గురించి అవగాహన పెంచుకుందాం!
అత్యధిక మధుమేహులున్న భారతదేశాన్ని మధుమేహ ప్రపంచ రాజధానిగా పేర్కొంటూ ఉంటారు. కాబట్టి అంతకంతకూ పెరుగుతున్న మధుమేహంతో పాటు, రోగులు వారి చక్కెర మోతాదులను ఎప్పుటికప్పుడు పరీక్షించుకునే వీలుండే సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతోంది. ధరించే వీలుండే సెన్సార్లు మొదలు, ఇన్సులిన్ పెన్‌ల వరకూ అనేక రకాల వినూత్నమైన పరికరాలెన్నో తాజా గా అందుబాటులోకొచ్చాయి. వాటి సామ ర్థ్యం, లోటుపాట్ల గురించి తెలుసుకుందాం!
ఫ్రీస్టైల్ లిబ్రె 3
చేతికి ధరించే వీలున్న పరికరమిది. చర్మం అడుగున ఉండే సెన్సార్, రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను రోజులో 24 గంటల పాటు పరీక్షిస్తూనే ఉంటుంది. ఈ పరికరంలోని ట్రాన్స్‌మీటర్, గ్లూకోజ్ ఫలితాలను సెల్ ఫోన్‌కు నిరంతరం పంపిస్తూనే ఉంటుంది. కాబట్టి తేలికగా గ్లూకోజ్‌లోని హెచ్చుతగ్గులను గమనిస్తూ ఉండవచ్చు.
భారతదేశంలో: దొరుకుతుంది
ధర: 14 రోజుల సెన్సార్ 4,500 - 5,000 రూ/-
అనుకూలతలు: సమర్థంగా పని చేస్తుంది. నీటిలో తడిచినా పాడవదు
ప్రతికూలతలు: రక్తంలో వేగంగా మారే చక్కెర మోతాదులను అంతే వేగంగా కనిపెట్టలేకపోవచ్చు. తీవ్ర డీహైడ్రేషన్, షాక్‌కు గురైన సందర్భాల్లో, డయాలసిస్ రోగుల్లో కచ్చితమైన ఫలితాలను కనబరచకపోవచ్చు.
సైనోకేర్ ఐక్యాన్ ఐ3
శరీరానికి అమర్చుకునే వీలుండే సెన్సార్ ఇది. రక్తంలోని చక్కెర మోతాదులను లెక్కిస్తూ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది.
భారతదేశంలో: దొరుకుతుంది
ధర: ఒక సెన్సార్ 4,500- 5,500 రూ/
అనుకూలతలు: అందుబాటు ధర, నీటిలో తడిచినా పాడవదు, స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించుకోవచ్చు
ప్రతికూలతలు: ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయదు, ఎవరికి వారు చక్కెర హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుండదు. దీన్ని వైద్యులే అమరుస్తారు. కాబట్టి 14 రోజుల తర్వాత వైద్యులే డాటాను డౌన్‌లోడ్ చేసుకుని చక్కెర మోతాదులను పర్యవేక్షించి మందులను మారుస్తారు.
ఇన్సులిన్ పంప్స్, పాడ్స్
భారతదేశంలో: దొరుకుతుంది
ధర: 5 నుంచి 6 లక్షలు
అనుకూలతలు: రక్తంలోని గ్లూకోజ్ మోతాదు ఆధారంగా ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది
ప్రతికూలతలు: అధిక ధర, శిక్షణ అవసరత
స్మార్ట్ ఇన్సులిన్ పెన్స్
స్మార్ట్‌ఫోన్ యాప్‌తో అనుసంధానమై పని చేసే ఈ పరికరం ఎప్పటికప్పుడు రోగులను అప్రమత్తం చేస్తూ ఉంటుంది.
భారతదేశంలో: దొరుకుతుంది
ధర: 2,500 నుంచి 3,500 రూ/
అనుకూలతలు: మోతాదులను లెక్కిస్తుంది, పిల్లలకూ ఉపయోగపడుతుంది, బ్యాటరీలతోపని లేదు
ప్రతికూలతలు: గ్లూకోజ్ డాటాకు లింక్ చేయదు
గార్డియన్ కనెక్ట్
ఇదొక నిరంతర చక్కెర పర్యవేక్షక వ్యవస్థ. రక్తంలోని చక్కెర మోతాదులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఆ సమాచారాన్ని సెల్ ఫోన్ యాప్‌కు చేరవేస్తూ ఉంటుంది.
భారతదేశంలో: విస్తృతంగా దొరకదు
ధర: 60 నుంచి 75 వేలు
అనుకూలతలు: హైపో/హైపర్‌గ్లైసీమియాలను కనిపెట్టి అప్రమత్తం చేస్తుంది
ప్రతికూలతలు: ఖరీదైనది, కచ్చితమైన ఫలితాన్ని తెలుసుకోవడం కోసం క్రమం తప్పక పరికరాన్ని పరీక్షిస్తూ ఉండాలి.
ఇన్‌పెన్
భారతదేశంలో: దొరకదు పలుమార్లు ఉపయోగించుకునే వీలున్న పరికరమిది. రక్తంలోని చక్కెర మోతాదులను పర్యవేక్షించి, తీసుకోవలసిన ఇన్సులిన్ మోతాదులను మొబైల్ యాప్‌కు చేరవేస్తుంది.
భారతదేశంలో: దొరకదు
ధర: ఏడాదికి 50 వేలు
అనుకూలతలు: బ్లూటూత్ ట్రాకింగ్, యాప్ ద్వారా మందు మోతాదులను లెక్కిస్తుంది
ప్రతికూలతలు: భారతదేశంలో దొరకదు, దీనికి సభ్యత్వం కూడా అవసరమే!
డాక్టర్ శ్రీ నగేష్
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్
డయాబెటాలజిస్ట్,
శ్రీ నగేష్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైన్ క్లినిక్,
ఇవి కూడా చదవండి
నీ వయస్సు అయిపోయింది.. అందుకే..
ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే
Read Latest AP News And Telugu News
టోలిచౌకి, హైదరాబాద్.