ఈ భంగిమతో గాఢ నిద్ర
ABN , Publish Date - Jun 10 , 2025 | 05:43 AM
ఈ భంగిమతో గాఢ నిద్ర కొంత మంది ఒక కాలిని లేదా రెండు కాళ్లను దుప్పటి బయట పెట్టి నిద్రపోతుంటారు. ఇలా చేయడం వలన ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

మీకు తెలుసా?
ఈ భంగిమతో గాఢ నిద్ర కొంత మంది ఒక కాలిని లేదా రెండు కాళ్లను దుప్పటి బయట పెట్టి నిద్రపోతుంటారు. ఇలా చేయడం వలన ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
నిద్రించే సమయంలో మనకు తెలియకుండానే, ఒక కాలిని దుప్పట్లో నుంచి బయట పెట్టి పడుకుంటూ ఉంటాం. అయితే ఇలా ఒక కాలును దుప్పటి బయట పెట్టి నిద్రపోయే అలవాటు వెనక ఒక ఆరోగ్యకరమైన కారణం ఉందని జోర్నల్ ఆఫ్ ఫిజియలాజికల్ యాంథ్రొపాలజీలో ప్రచురించిన 2023 నాటి అధ్యయనంలో పేర్కొన్నారు. ఇంతకూ ఇలాంటి అలవాటు వల్ల మన శరీరంలో ఏం జరుగుతుంది? శరీర వేడిని వేగంగా వదిలించుకోడానికి వీలుగా మన అరికాళ్లలో ప్రత్యేకమైన రక్తనాళాలుంటాయి. కాబట్టి రాత్రి వేళ కాళ్లను దుప్పటి వెలుపల ఉంచడం వల్ల, పాదాలకు చల్లటి గాలి సోకి, శరీర ఉషోగ్రత తగ్గుతుంది.. దాంతో గాఢనిద్రకు అవసరమయ్యే మెలటోనిన్ హార్మోన్ స్రావం పెరుగుతుంది. ఇలా శరీరం చల్లబడే ప్రభావం, నిద్రలోకి జారుకునే సమయాన్ని వేగవంతం చేస్తుందనీ, గాఢనిద్రలోకి జారుకునేలా చేసి, నిద్ర నాణ్యతను పెంచుతుందనీ పరిశోధకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్
పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్
Read Latest AP News And Telugu News