Share News

బొద్దింకలను వదిలించుకోండి ఇలా

ABN , Publish Date - Jun 04 , 2025 | 06:30 AM

ఒక్కోసారి ఇంట్లో బొద్దింకలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. రాత్రి కాగానే ఇల్లంతా పాకుతూ ఆహారపదార్థాల మీద కూడా చేరుతూ ఉంటాయి. బజారు నుంచి తెచ్చిన రసాయనిక మందులు పిచికారీ చేసినప్పటికీ ఈ సమస్య పూర్తిగా తీరదు. అలాకాకుండా ...

బొద్దింకలను వదిలించుకోండి ఇలా

ఒక్కోసారి ఇంట్లో బొద్దింకలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. రాత్రి కాగానే ఇల్లంతా పాకుతూ ఆహారపదార్థాల మీద కూడా చేరుతూ ఉంటాయి. బజారు నుంచి తెచ్చిన రసాయనిక మందులు పిచికారీ చేసినప్పటికీ ఈ సమస్య పూర్తిగా తీరదు. అలాకాకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతో చిన్న చిట్కాలు పాటించి ఈ బొద్దింకల బెడద నుంచి తప్పించుకోవచ్చు.

  • ఒక బకెట్‌ నీళ్లలో రెండు చెంచాల బోరాక్స్‌ పౌడర్‌, రెండు చెంచాల బేకింగ్‌ సోడా, మూడు చెంచాల పంచదార వేసి బాగా కలపాలి. ఈ నీళ్లను స్ర్పే బాటిల్‌లో పోసి రాత్రిపూట బొద్దింకలు ఎక్కువగా తిరిగే వంటగది, డైనింగ్‌ టేబుల్‌, బాత్‌రూమ్‌ల దగ్గర పిచికారీ చేయాలి. తెల్లారిన తరవాత ఈ ప్రదేశాలను తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేసుకోవాలి. ఇలా నాలుగు రోజులు చేస్తే బొద్దింకల సమస్య తగ్గుతుంది.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల బోరిక్‌ యాసిడ్‌, మూడు చెంచాల మైదా పిండి వేసి బాగా కలపాలి. ఇందులో కొన్ని నీళ్ల చుక్కలు చల్లుతూ గట్టిగా కలిపి చిన్న ఉండలు చేయాలి. వీటిని గాలికి ఆరబెట్టాలి. ఈ ఉండలను బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట మూలల్లో ఉంచాలి. రెండు రోజుల్లో ఇంట్లో ఉన్న బొద్దింకలన్నీ చనిపోతాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు.... ఈ చిట్కాను పాటించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల దాల్చిన చెక్క పొడి, ఒక చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పొడిని వంటగది అరల్లో కొద్దిగా చల్లితే బొద్దింకలు బయటికి వెళ్లిపోతాయి.

  • బొద్దింకలు తిరిగే చోటా కొద్దిగా హెయిర్‌స్ర్పే చల్లినా ఫలితం ఉంటుంది. పడకగది, పిల్లలు చదువుకునే గది మూలల్లో రెండు లవంగాలు లేదంటే బిరియానీ ఆకు ముక్కలు ఉంచితే బొద్దింకలు లోపలికి రావు.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 06:31 AM