Beautiful Lips Tips: అందమైన అధరాల కోసం
ABN , Publish Date - Sep 04 , 2025 | 02:32 AM
పెదవులు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. కానీ రకరకాల కారణాల వలన పెదవులు నల్లగా మారడం, పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పెదవులను అందంగా ఎలా మార్చుకోవాలో...
పెదవులు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. కానీ రకరకాల కారణాల వలన పెదవులు నల్లగా మారడం, పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పెదవులను అందంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం..
ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు పెదాలకు బీట్‌రూట్ రసాన్ని రాసుకుంటే క్రమక్రమంగా అధరాలు కాంతులీనుతాయి.
రోజూ పెదవులకు కొబ్బరి నూనె రాస్తే నునుపు అవుతాయి.
పెదవులకు వెన్న రాసి మర్ధనా చేసినా మృదువుగా మారతాయి.
ఆలివ్ నూనె రాయడం వలన పెదాలకు తేమ అందుతుంది.
పెదాలకు తేనె రాయడం వలన కూడా నలుపు రంగు తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..
వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత