Gold Nanorods: కంటి చికిత్స కొత్తగా...
ABN , Publish Date - Jul 15 , 2025 | 01:30 AM
కంటి చికిత్స, క్షీణించిన కంటిచూపును మరింత దెబ్బతీసేలా ఉండకూడదు. మరీ ముఖ్యంగా రెటీనా జబ్బుల్లో చేసే చికిత్సల్లో ఇదే జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించే, శస్త్రచికిత్సతో...
పరిశోధన
కంటి చికిత్స, క్షీణించిన కంటిచూపును మరింత దెబ్బతీసేలా ఉండకూడదు. మరీ ముఖ్యంగా రెటీనా జబ్బుల్లో చేసే చికిత్సల్లో ఇదే జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించే, శస్త్రచికిత్సతో పని లేని ఒక సరికొత్త చికిత్సా విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. అదేంటో తెలుసుకుందాం!
మాక్యులర్ డీజెనరేషన్, రెటీనైటిస్ పిగ్మెంటోసా లాంటి కంటి సమస్యలతో కంటిచూపును కోల్పోయిన వారి చికిత్స కోసం రెటైనల్ ప్రోస్థెసి్‌సను రూపొందించారు. సాధారణంగా ఈ కంటి సమస్యల్లో అనుసరించే సంప్రదాయ శస్త్రచికిత్సల్లో భాగంగా ఎలకో్ట్రడ్స్‌ను కంట్లో అమర్చడం లేదా జన్యు ఆధారిత చికిత్సలను ఎంచుకుంటూ ఉంటారు. ఈ చికిత్సలతో కంటిచూపు స్పష్టత, మెరుగుదల పరిమితంగానే ఉంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా బ్రౌన్ యూనివర్శిటీ పరిశోధకులు శస్త్రచికిత్సతో పని లేని ఒక కొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. సాధారణంగా నానో పార్టికల్స్ ఉపయోగించే చేసే చికిత్సా విధానంలో, మిరుమిట్లు గొలిపే వెలుగు అవసరమవుతూ ఉంటుంది. ఆ వెలుగుతో కంట్లో మిగిలి ఉన్న కంటిచూపు కూడా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా పరిశోధకులు ‘ప్లాస్మోనిక్ గోల్డ్ నానోరాడ్స్’ అనే సూక్ష్మ బంగారు కడ్డీలను రూపొందించారు. ఇవి అతినీలలోహిత వెలుగుకు మాత్రమే ప్రతిస్పందిస్తాయి. కాబట్టి కంటిచూపు సురక్షితంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ఈ కడ్డీలు కంటిచూపును ఏమాత్రం దెబ్బతీయకుండా నాడీ కణాలను ప్రేరేపించగలుగుతాయని కూడా పరిశోధకులు అంటున్నారు. బ్రౌన్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన తాజా చికిత్సా విధానం, కంటిచూపు దెబ్బతిన్న రోగులకు శస్త్రచికిత్సతో పని లేని సురక్షితమైన పరిష్కారాన్ని అందించగలుగుతుంది.
ఇవి కూడా చదవండి
నీ వయస్సు అయిపోయింది.. అందుకే..
ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే
Read Latest AP News And Telugu News