Share News

Buddhism: కాలాతీతం ఆయన మార్గం

ABN , Publish Date - May 23 , 2025 | 04:31 AM

బౌద్ధం బుద్ధి ఆధారిత కర్మ సిద్ధాంతాన్ని బోధించి మానవత్వానికి మార్గదర్శకం అయ్యింది. సమాజంలో శాంతి ఉండాలంటే ధర్మచింతనతో నడిచే వ్యక్తుల సమూహం అవసరమని బుద్ధుడు బోధించాడు.

Buddhism: కాలాతీతం ఆయన మార్గం

ప్రపంచంలో పలు మతాలు ఉన్నాయి. పుట్టుకతోనే మనిషికి ఒక మతం ఉంటుంది.

పెరిగే వయసుతోపాటు ఆ మతం తాలూకు నమ్మకాలు అతనితో పెనవేసుకుపోతాయి. కొందరిలో అవి తర్కాన్ని చిదిమేసి, మూఢనమ్మకాలవైపు నడిపిస్తాయి. ఆ మనుషులు ఏర్పరచుకున్న భావనల్లో మానవత్వం మరుగుపడిపోతుంది మనిషి, అతని నడవడిక, ఆలోచన, ఆచరణలే కేంద్రంగా ఏర్పడిన మతం... బౌద్ధం. ప్రపంచానికి ప్రేమను, కరుణను, అహింసను మొదటిసారిగా అందించినవాడు బుద్ధుడు.

హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నదనేది మనకందరికీ తెలిసినదే. హిందువులు పవిత్ర గ్రంథంగా భావించే ‘భగవద్గీత’లో కర్మ గురించి ఒక అధ్యాయమే ఉంది. అలాగే బౌద్ధం కూడా కర్మకు ప్రాధాన్యాన్నిచ్చింది. అయితే హైదవం ‘బుద్ధి కర్మానుసారిణీ’ అంటే... ‘కర్మ బుద్ధ్యానుసారిణీ’ అంటుంది బౌద్ధం. ‘కర్మను బట్టి మన బుద్ధి నడుచుకుంటుంది. ఏ ఆలోచన వచ్చినా, ఆపద కలిగినా, ఉపద్రవం సంభవించినా అది మన కర్మ ఫలితమే’ అనే భావన హైందవానిది. దానికి భిన్నంగా... ‘మనం చేసే ప్రతి కర్మా మన ఆలోచనల ఫలితం’ అని బౌద్ధం చెబుతుంది. చాలా చిన్నదిగా కనిపించే ఈ తేడా... ఆ మతాలను అనుసరించే మనుషుల మీద, సంఘం మీద పెను ప్రభావం ఎలా చూపిస్తుందనేది పరిశీలించవలసిన అవసరం ఉంది.

ధర్మచింతనా ముఖ్యమే...

ప్రతిదాన్నీ కర్మే నిర్ణయిస్తే... వ్యక్తి తను చేస్తున్న పనుల గురించి దృఢమైన ఆలోచనలు ఎలా చేయగలడు? పేదరికంలో ఉన్నవాడు, అణచివేతకు, అన్యాయాలకు గురవుతున్న వాడు ఇదంతా తన కర్మ ఫలితమేననే ఉదాసీనతకు గురవుతాడు. ‘మనం ఏమిటనేది మన ఆలోచనల ఫలం, మన ఆలోచనల ఆధారంగానే మనం నిర్మితం అవుతాం’ అనే ‘ధర్మపదం’ ప్రజలకు చేరడం, వారు అంగీకరించడం. త్రిశరణాలుగా ఖ్యాతి పొందిన ‘బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి’ అనేవి బుద్ధునికి ప్రతీకలు. సంఘం అంటేనే మనుషుల సమూహం. నైతిక ప్రవర్తన, ధర్మ చింతన, స్వీయ పరిశీలన లేని మనుషులు ఉండే సంఘంలో అశాంతి, ఆటవికత రాజ్యం ఏలుతాయి.

కాబట్టి మనిషికి సంఘం ఎంత ముఖ్యమో... ఆ సంఘంలో ఉండే మనుషుల్లో ధర్మ చింతన కూడా అంతే ముఖ్యమని వేల సంవత్సరాల క్రితమే తెలియజెప్పిన బుద్ధుని బోధలు కాలాతీతంగా మానవతకు మార్గదర్శకాలు.

హైదవం ‘బుద్ధి కర్మానుసారిణీ’ అంటే... ‘కర్మ బుద్ధ్యానుసారిణీ’ అంటుంది బౌద్ధం. ‘కర్మను బట్టి మన బుద్ధి నడుచుకుంటుంది. ఏ ఆలోచన వచ్చినా, ఆపద కలిగినా, ఉపద్రవం సంభవించినా అది మన కర్మ ఫలితమే’ అనే భావన హైందవానిది. దానికి భిన్నంగా... ‘మనం చేసే ప్రతి కర్మా మన ఆలోచనల ఫలితం’ అని బౌద్ధం చెబుతుంది. చాలా చిన్నదిగా కనిపించే ఈ తేడా... ఆ మతాలను అనుసరించే మనుషుల మీద, సంఘం మీద పెను ప్రభావం ఎలా చూపిస్తుందనేది పరిశీలించవలసిన అవసరం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 04:31 AM