Share News

Physiotherapy for Pregnant Women: గర్భిణులకు ఫిజియోథెరపీ

ABN , Publish Date - Oct 30 , 2025 | 02:41 AM

గర్భిణిగా ఉన్న సమయంలో, ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత కలిగే శారీరక ఇబ్బందులను ఎదుర్కోవటానికి, వాటిని అదుపులోకి తెచ్చుకోవటానికి ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది...

Physiotherapy for Pregnant Women: గర్భిణులకు ఫిజియోథెరపీ

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! ఫిజియోథెరపీ సుఖ ప్రసవానికి తోడ్పడుతుందనీ, ప్రసవం తదనంతర ఆరోగ్యానికి కూడా సహాయపడుతుందనీ వైద్యులు అంటున్నారు. ఇదెంతవరకూ నిజం? గర్భిణులు ఫిజియోథెరపీ చేయవచ్చా?

- ఓ సోదరి, హైదరాబాద్‌.

గర్భిణిగా ఉన్న సమయంలో, ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత కలిగే శారీరక ఇబ్బందులను ఎదుర్కోవటానికి, వాటిని అదుపులోకి తెచ్చుకోవటానికి ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది.

  • గర్భం దాల్చినప్పుడు శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. వెన్ను, నడుము నొప్పి, కాళ్ల వాపులు లాంటి ఇబ్బందులు ప్రారంభంలో ఉంటాయి. మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి మూత్రం ఆపుకోలేకపోవటం (యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌)లాంటి సమస్య మొదలవుతుంది. ఇలాంటి వాటికి వేడి, చల్లని కాపడం పెట్టడం, స్ట్రెచెస్‌ చేయించటం లాంటి వ్యాయామాలు ఉపయోగపడతాయి

  • మూత్రాన్ని అదుపు చేయగలిగే కటి కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది

  • కొందరికి ఆరో నెలలోనే ఎనిమిది నెలల గర్భంలా పొట్ట ఎత్తుగా తయారవుతుంది. ఇందుకు కారణం వాళ్లు శరీరాకృతిని సరిగా అనుసరించకపోవటమే! ఇలాంటి శరీరాకృతి సమస్యల వల్ల కండరాల మీద ఒత్తిడి పెరిగి నొప్పులు మొదలవుతాయి. ఈ నొప్పులు రాకుండా ఉండాలంటే ఫిజియోథెరపిస్టులను సంప్రదించి శరీర భంగిమలను సరిదిద్దుకోవాలి

  • సుఖ ప్రసవం జరగాలంటే నడుములోని కండరాలు బలంగా కలిగి ఉండాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా కొన్ని వ్యాయామాలను చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రసవ సమయంలో ఎంతో ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఊపిరి ఎలా తీసుకోవాలి? ఎప్పుడు రిలాక్స్‌ అవ్వాలి? ఎప్పుడు గాలి లోపలికి తీసుకుని ప్రసవం జరిగేలా పుషింగ్‌ బ్రీతింగ్‌ చేయాలి? అన్నది ఫిజియోథెరపిస్టులు సూచిస్తారు

  • ప్రసవం తర్వాత వదులైన కండరాలను తిరిగి బిగుతుగా చేసుకోగలిగే వ్యాయామాల విషయంలో కూడా ఫిజియోథెరపిస్టుల సహాయంతో చేయాలి.

  • ప్రసవం జరిగిన తీరును బట్టి త్వరగా కోలుకోవటానికి అనుసరించవలసిన పద్ధతులు, పాలిచ్చే విధానం, నొప్పిని అదుపులోకి తెచ్చుకోగలిగే పద్ధతులను కూడా ఫిజియోథెరపీలో తెలుసుకోవచ్చు.

డాక్టర్‌ మానస,

సీనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి:

కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..

మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు

Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..

Updated Date - Oct 30 , 2025 | 02:41 AM