Share News

రసాయన రంగుల నుంచి రక్షణ ఇలా...

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:23 AM

బజారు నుంచి తెచ్చే హోలీ రంగుల్లో రసాయనాలు కలిసి ఉంటాయి. వీటి వల్ల చర్మానికి, కురులకు హాని కలుగవచ్చు. హోలీ ఆడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం...

రసాయన రంగుల నుంచి రక్షణ ఇలా...

బజారు నుంచి తెచ్చే హోలీ రంగుల్లో రసాయనాలు కలిసి ఉంటాయి. వీటి వల్ల చర్మానికి, కురులకు హాని కలుగవచ్చు. హోలీ ఆడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

  • రంగులు చల్లుకున్న తరవాత రసాయనాల ప్రభావం వల్ల చర్మం పొడిబారి మంటగా అనిపించవచ్చు. కాబట్టి ముందుగానే ముఖం, చేతులు, కాళ్లకు మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మంచిది. కొబ్బరి నూనె లేదా బాదం నూనె రాసుకున్నా ఫలితం ఉంటుంది. వీటిని రాసుకోవడం వల్ల రంగులు చర్మం లోపలి పొరల్లోకి ప్రవేశించలేవు.

  • హోలీ ఆడే ముందు తలకు కొబ్బరినూనె లేదా ఆలివ్‌ నూనె రాసుకోవాలి. దీనివల్ల మాడు మీద రక్షణ పొర ఏర్పడి వెంట్రుకల కుదుళ్లలోకి రంగులు చొచ్చుకుని పోకుండా ఉంటాయి. నూనె రాయడం వల్ల శిరోజాలకు రంగులు అంతగా పట్టవు. తలస్నానం చేసిన వెంటనే తేలికగా రంగులు వదిలిపోయి వెంట్రుకలు మృదువుగా మెరుస్తాయి.


  • రంగుల నుంచి శిరోజాలను కాపాడుకోవడానికి టోపీ, స్కార్ప్‌ ధరించవచ్చు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే తేలికపాటి నూలు బట్టలు వేసుకోవాలి. దుస్తులు మరీ బిగుతుగా కాకుండా కొద్దిగా వ దులుగా ఉన్నవి అయితే మంచిది. పాదాలకు షూస్‌ ఽవేయడం ఉత్తమం.

  • గోళ్లకు రంగులు అంటకుండా నెయిల్‌ పాలిష్‌ వేస్తే మంచిది

  • హోలీ ఆడడానికి వెళ్లే ముందు పెదవులకు లిప్‌ బామ్‌ వేసుకోవాలి. లేదంటే రంగుల వల్ల పెదవులు తేమను కోల్పోతాయి. వాటిపై పగుళ్లు ఏర్పడి రక్తస్రావం కావచ్చు.

  • హోలీ ఆడిన తరవాత ముఖాన్ని, చేతులను సబ్బుతో ఎక్కువగా రుద్దకూడదు. సున్నిపిండి లేదా శనగపిండిని ఉపయోగించడం మంచిది.

ఈ వార్తలు కూడా చదవండి:

Vijaysai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ.. సంచలన విషయాలు వెల్లడి..

journalist Revathi: మహిళా జర్నలిస్టుకు 14 రోజుల రిమాండ్.. సంచలనం రేపుతున్న ఘటన..

Updated Date - Mar 13 , 2025 | 12:23 AM