Magnesium deficiency : మెగ్నీషియం మతలబులు
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:34 AM
ఇటీవలి కాలంలో మెగ్నీషియం లోపం సర్వత్రా పెరిగింది. ఈ పోషకం ఎన్నో కీలకమైన జీవ క్రియలకు సహాయపడుతూ ఉంటుంది. కండర సామర్ధ్యం, అధిక రక్తపోటు, నిద్రల్లో కీలక భూమిక పోషించే మెగ్నీషియం లోపాన్ని ఎలా భర్తీ చేసుకోవచ్చో తెలుసుకుందాం!

క్యాల్షియం, జింక్, క్యాల్షియంలతో కలిపి తీసుకుంటే మెగ్నీషియం శోషణ తగ్గి, దాని సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి మెగ్నీషియంను ఈ సప్లిమెంట్లతో కలిపి తీసుకోకూడదు
పుల్లని పండ్లలో సిట్రిక్ యాసిడ్‌తో కలిసిన మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం లోపాన్ని భర్తీ చేసుకోవడం కోసం పుల్లని పండ్లను తినొచ్చు.
ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
నట్స్, సీడ్స్, పొట్టుతీయని ధాన్యాలు, చేపల్లో కూడా ఈ పోషకం ఎక్కువగా ఉంటుంది
జీడిపప్పు, బాదం, గుమ్మడికాయ విత్తనాలు, పీనట్ బటర్ బీన్స్, సోయా బీన్స్, సోయా పాలతో కూడా మెగ్నీషియంను సరిపడా పొందవచ్చు.
మెగ్నీషియం ల్యాక్సేటివ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మోతాదు పెరిగితే విరోచనాలు వేధిస్తాయి. కాబట్టి వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు కూడా వాడుకోవచ్చు