Scientific Breakthrough: అల్జీమర్స్‌కు టీకా మందు
ABN , Publish Date - Aug 05 , 2025 | 03:25 AM
పైబడే వయసులో వేధించే ఆరోగ్య సమస్య అల్జీమర్స్. ఇప్పటివరకూ ఈ రుగ్మతకు అడ్డుకట్ట వేసే చికిత్సలు రూపొందలేదు. అయితే తాజాగా అల్జీమర్స్‌ను అడ్డుకునే ఒక టీకాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆ వివరాలు....
ఆవిష్కరణ
పైబడే వయసులో వేధించే ఆరోగ్య సమస్య అల్జీమర్స్. ఇప్పటివరకూ ఈ రుగ్మతకు అడ్డుకట్ట వేసే చికిత్సలు రూపొందలేదు. అయితే తాజాగా అల్జీమర్స్‌ను అడ్డుకునే ఒక టీకాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆ వివరాలు....
మతిమరుపు, నాడీకణాల క్షీణతతో సంబంధమున్న ‘టౌ’ అనే విషపూరిత ప్రొటీన్ లక్ష్యంగా పని చేసే ఒక టీకాను న్యూ మెక్సికోలోని శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ఇప్పటివరకూ అల్జీమర్స్‌కు కేవలం లక్షణాలను నియంత్రించే చికిత్స మాత్రమే కొనసాగుతూ ఉంది. దీనికి భిన్నంగా, తాజాగా అభివృద్ధి చేసిన టీకా, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, టౌ ప్రొటీన్‌ను గుర్తించి, దాన్ని హతం చేసేలా రోగనిరోధక వ్యవస్థకు శిక్షణనిస్తుంది. ఈ దిశగా ఎలుకల మీద చేపట్టిన ప్రయోగాల్లో, టీకా అందించిన ఎలుకల్లో టౌ ప్రొటీన్ ఉత్పత్తి క్షీణించినట్టు, ఫలితంగా అల్జీమర్స్ వ్యాధి ఉధృతి కూడా గణనీయంగా కుంటుపడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఫలితాల ఆధారంగా ప్రస్తుతం ఇవే ప్రయోగాలను మనుషుల మీద చేపట్టే ప్రయత్నాల్లో ఉన్న శాస్త్రవేత్తలు, ఈ ప్రయోగాలు విజయవంతమైతే, ఈ టీకా అతి త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News