Share News

Parenting Tips: పదేళ్లలోపు పిల్లలకు ఇవి చెప్పకూడదు

ABN , Publish Date - Nov 12 , 2025 | 06:01 AM

చిన్న చిన్న పనులు చెప్పి చేయించడం వల్ల పిల్లలు బాధ్యతాయుతంగా మెలగడం నేర్చుకుంటారు. కానీ పదేళ్లలోపు పిల్లలకు కొన్ని పనులు చెప్పకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వాటి గురించి...

Parenting Tips: పదేళ్లలోపు పిల్లలకు ఇవి చెప్పకూడదు

చిన్న చిన్న పనులు చెప్పి చేయించడం వల్ల పిల్లలు బాధ్యతాయుతంగా మెలగడం నేర్చుకుంటారు. కానీ పదేళ్లలోపు పిల్లలకు కొన్ని పనులు చెప్పకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం...

  • పదేళ్లలోపు పిల్లలకు గ్యాస్‌ స్టవ్‌ వెలిగించడం, కెటిల్‌ ఉపయోగించడం, ఇస్త్రీ చేయడం లాంటి పనులు చెప్పకూడదు.

  • కూరగాయలు కోయడం, వేటినైనా కత్తిరించడం, మిక్సీ లేదా బ్లెండర్‌ వాడడం లాంటి పనులు చెప్పకూడదు.

  • అటక మీద నుంచి వస్తువులు దించడం, బరువైన వస్తువులను ఎత్తడం, లగేజ్‌ బ్యాగ్‌లు పట్టుకుని మెట్లు ఎక్కడం లేదా దిగడం లాంటి పనులను పురమాయించకూడదు. నీళ్ల బిందెలు లేదా బకెట్లు మోయడంలాంటివి కూడా చెప్పకూడదు. ఇలాంటి పనులు చేయడం వల్ల పిల్లల్లో వెన్ను నొప్పి, కండరాలు పట్టేయడం లాంటి సమస్యలు వస్తాయి.

  • చిన్న పిల్లలకు వ్యాక్యూమ్‌ క్లీనర్‌, రైస్‌ కుక్కర్‌, ఎలక్ట్రిక్‌ స్టవ్‌, ఓవెన్‌లతో చేసే పనులు చెప్పకూడదు.

  • రకరకాల క్లీనర్స్‌, యాసిడ్‌, బ్లీచింగ్‌ పౌడర్‌లతో చేసే పనులను పిల్లలకు చెప్పకూడదు.

  • గోడలకు మేకులు కొట్టడం, బజారు నుంచి మందులు తీసుకురమ్మనడం, నిచ్చెన ఎక్కడం లాంటి పనులను కూడా చిన్న పిల్లలకు చెప్పకూడదు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్

ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం

Updated Date - Nov 12 , 2025 | 06:01 AM