నేషనల్ డిఫెన్స్ అకాడమి అండ్ నేవల్ అకాడమి
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:14 AM
నేషనల్ డిఫెన్స్ అకాడమి అండ్ నేవల్ అకాడమి ఎగ్జామినేషన్ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది...
మొత్తం ఖాళీలు: 406
నేషనల్ డిఫెన్స్ అకాడమి అండ్ నేవల్ అకాడమి ఎగ్జామినేషన్ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 జూలై 1 నుంచి ప్రారంభం అయ్యే ఎన్‌డిఏ 156 కోర్, ఇండియన్ నేవల్ అకాడమి 118 కోర్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఆసక్తిగల అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థులు యూపీఎస్సీ ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
1. నేషనల్ డిఫెన్స్ అకాడమి(ఎన్‌డీఏ) 370 పోస్టులు
ఆర్మీవింగ్: 208 (మహిళలకు 10)
నేవీ వింగ్: 42 (మహిళలకు 5)
ఎయిర్‌ఫోర్స్ వింగ్: ఫ్లైయింగ్ బ్రాంచ్ 92(మహిళలకు 2)
గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్): 18 (మహిళలకు 2)
గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్): 10 (మహిళలకు 2)
2. నేవల్ అకాడమి(10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్) 36 పోస్టులు
మొత్తం 36 పోస్టులు (మహిళలకు 4)
వయస్సు: 2007 జనవరి 2 నుంచి 2010 జనవరి 1వ తేదీ మధ్యలో జన్మించి ఉండాలి.
విద్యార్హత: ఆర్మీ వింగ్ పదో తరగతి పాసై ఉండాలి
ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్/ ఎన్‌ఏ కేడెట్ ఎంట్రీ స్కీమ్: మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో ఇంటర్ పాసై ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష: మేథ్స్ 300 మార్కులు, జీకే+ఇంగ్లిష్ 600 మార్కులు(మొత్తం 900 మార్కులు). తప్పుగా గుర్తించిన సమాధానానికి నెగెటీవ్ మార్కింగ్ ఉంటుంది.
ఎస్‌ఎ్‌సబీ ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్: 900 మార్కులు
ఎయిర్‌ఫోర్స్ కేడెట్స్: కంప్యూటరైజ్డ్ పైలెట్ సెలెక్షన్ సిస్టమ్(సీపీఎ్‌సఎస్) పాస్ కావాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్ 17
పరీక్ష తేదీ: 2025 సెప్టెంబర్ 14
వెబ్‌సైట్: https://upsconline.nic.in/
For AndhraPradesh News And Telugu News