Share News

Parenting Tips: పిల్లలను బడికి పంపేటప్పుడు...

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:15 AM

పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతిరోజూ ఉదయం హడావిడిగానే ఉంటుంది. అయినప్పటికీ తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సహనంతో వ్యవహరిస్తే పిల్లలు ఆనందంగా బడికి వెళతారని నిపుణులు చెబుతున్నారు.

Parenting Tips: పిల్లలను బడికి పంపేటప్పుడు...

పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా ఎదగడమే కాకుండా మానసికంగా దృఽఢంగా ఉండేలా చూసుకోవాలి. వాళ్ల భావోద్వేగాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఉదయం లేవగానే వాళ్లు చెప్పే మాటలను ఓపికగా విని అర్థం చేసుకోవాలి.

గట్టిగా మాట్లాడడం, పెద్దగా అరవడం వల్ల పిల్లలు భయాందోళనలకు గురవుతారు. తల్లిదండ్రులు మెల్లగా, మృదు స్వరంతో మాట్లాడుతూ వాళ్లకి అర్థమయ్యే రీతిలో నచ్చచెప్పాలి.

పిల్లలు ఉదయాన్నే నిద్ర లేవడానికి ఇష్టపడరు. వాళ్లని మెల్లగా తడుతూ మేల్కొలపాలి. ఆలస్యంగా లేవడం వల్ల కలిగే సమయాభావ పరిస్థితులను నిదానంగా వివరించాలి. సమయానికి బడికి వేళ్లేలా అలవాటు చేయాలి.

ఉదయం వంట పూర్తవగానే భోజనం, స్నాక్స్‌ తదితరాలను చక్కగా బాక్సుల్లో సర్దాలి. వాటర్‌ బాటిల్‌ నింపి పెట్టాలి. పిల్లలు పెరుగుతున్న క్రమంలో ఈ పనులు పూర్తి చేయడానికి వాళ్ల సహాయం తీసుకోవాలి.



బడికి వెళ్లేముందు టైమ్‌ టేబుల్‌ ప్రకారం పుస్తకాలు సర్దుకోవడం, యూనిఫామ్‌ వేసుకోవడం, షూ పాలిష్‌ లాంటి పనులు సొంతంగా చేసుకోవడాన్ని పిల్లలకు నేర్పించాలి.

పిల్లలకు ఉదయాన్నే పాలు తాగడం, అల్పాహారం తీసుకోవడం అలవాటు చేయాలి.

పిల్లలు బడికి బయలుదేరేముందు తల్లిదండ్రులు ప్రశాంత వదనంతో వీడ్కోలు చెప్పాలి.

బడి నుంచి ఇంటికి రాగానే కొంత సమయం విరామం ఇచ్చి పిల్లల చేత హోమ్‌వర్క్‌ పూర్తి చేయిస్తే ఉదయం లేవగానే ఆందోళన ఉండదు.

పరీక్షలప్పుడు పిల్లలు ఒత్తిడికి గురికాకుండా ప్రోత్సాహకరమైన మాటలు చెబితే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

స్పష్టమైన పదాలతో తేలికపాటి సూచనలు చేస్తూ ఉంటే పిల్లలు అన్ని పనులూ సులభంగానే నేర్చుకుంటారు.



మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 04:15 AM