వానల్లో వయ్యారంగా
ABN , Publish Date - Jun 04 , 2025 | 06:49 AM
చిత్తడిలో నేల మీద జీరాడే దుస్తులు ధరించలేం! కాబట్టి ప్రత్యేకించి వాన రోజుల్లో కురచ గౌన్లకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు అమ్మాయిలు....
చిత్తడిలో నేల మీద జీరాడే దుస్తులు ధరించలేం! కాబట్టి ప్రత్యేకించి వాన రోజుల్లో కురచ గౌన్లకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు అమ్మాయిలు.
అలాంటి కొన్ని చిట్టి పొట్టి గౌన్ల మీద ఓ లుక్కేద్దామా?
మోకాలి పొడవు గౌన్లు ధరించడానికి సౌకర్యంగా ఉండడంతో పాటు చూడముచ్చటగా కనిపిస్తాయి. పూలు, లతల డిజైన్లు, జామెట్రిక్ డిజైన్లు... ఇలా భిన్నమైన డిజైన్లతో, భిన్నమైన వస్త్రాలతో రూపొందే షార్ట్ గౌన్స్‌కు అనువైన కాలమిది. అయితే వీటిని ధరించేటప్పుడు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవేంటంటే...
కాటన్, లినెన్, జార్జెట్, స్పన్... ఇలా గౌన్లు ఎన్నో రకాల వస్త్రాలతో తయారవుతూ ఉంటాయి. అయితే ఒడ్డు పొడవుల ఆధారంగా ఎవరికి వారు ఈ గౌన్లను ఎంచుకోవాలి. నాజూకుగా ఉన్న మహిళలు కాటన్, లినెన్ గౌన్లను ఎంచుకోవచ్చు. బొద్దుగా ఉండేవారికి స్పన్, జార్జెట్ గౌన్లు బాగుంటాయు
బ్లంట్ హీల్స్, పెన్సిల్ హీల్స్.. వీటిలో ఏ జోళ్లు ధరించినా గౌన్లకు చక్కగా మ్యాచ్ అవుతాయి. అయితే ఇది వానాకాలం కాబట్టి తోలుతో తయారైన జోళ్లకు బదులుగా ఇతరత్రా మెటీరియల్స్‌తో తయారైన వాటినే ఎంచుకోవాలి.
ఈ గౌన్లతో కృత్రిమ ఆభరణాలు, జర్మన్ సిల్వర్ ఆభరణాలు ధరించవచ్చు. ఈ ఆభరణాలు వీలైనంత సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి
ఇక మిగతా యాక్సెసరీస్ విషయానికొస్తే పర్సులకు బదులుగా స్లింగ్ బ్యాగ్స్ గౌన్లకు చక్కగా నప్పుతాయి. చేతులకు బ్యాంగిల్స్‌కు బదులుగా పెద్ద డయల్ కలిగిన వాచీలను ఎంచుకోవాలి.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి