Share News

Salaam: సలామ్‌.. ఒక ప్రార్థన

ABN , Publish Date - May 23 , 2025 | 04:26 AM

‘సలామ్‌’ అనే పదం అల్లాహ్‌ శుభనామాల్లో ఒకటి, ఇది శాంతి ప్రదాత అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. సలాం చేయడం ఒక పవిత్ర ఆచారం, ముందుగా చేయేవారు అల్లాహ్‌ దృష్టిలో శ్రేష్ఠులు అవుతారని ప్రవక్త మహమ్మద్‌ అన్నారు.

Salaam: సలామ్‌.. ఒక ప్రార్థన

‘సలామ్‌’ అనే పదం అల్లాహ్‌ మహోన్నతమైన శుభ నామాల్లో ఒకటి. దానికి ‘శాంతి ప్రదాత’ అని, ‘అల్లాహ్‌ శాంతికి మూలం. మీపై శాంతి శ్రేయస్సులు వర్షించుగాక’ అని అర్థాలు ఉన్నాయి. తొలి మానవుడైన ఆదం (అలై)ను సృష్టించిన అల్లాహ్‌... అతనికి అన్నిటికన్నా ముందు సలామ్‌ చేసే సంస్కారాన్ని నేర్పాడు. ఎదుట ఉన్న వ్యక్తి ఒక్కరే అయినప్పటికీ... బహువచనాన్ని ఉపయోగిస్తూ సలామ్‌ చేయడం, బదులుగా ఎదుటి వ్యక్తి కూడా అదే రీతిలో సలామ్‌ చేయడం అభిలషణీయమైన పద్ధతి. ‘‘ఎవరైనా మీకు గౌరవభావంతో సలామ్‌ చేస్తే... మీరు అంతకన్నా ఉత్తమమైన పద్ధతిలో ప్రతి సలామ్‌ చేయండి. లేదా కనీసం ఆ విధంగానైనా చేయండి. ఇతరుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు... వారికి సలామ్‌ చేసి, వారి అంగీకారం పొందిన తరువాతే లోపలికి ప్రవేశించండి. ఇది ఎంతో ఉత్తమమైన పద్ధతి. అది మేలు కోసం చేసే ప్రార్థన. అల్లాహ్‌ తరఫున నిర్ణయించిన ఈ పద్ధతి ఎంతో శుభవంతమైనది, పరిశుద్ధమైనది’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. ఎదుటి వ్యక్తులకు ముందుగా సలామ్‌ చేసేవారు అల్లాహ్‌ దృష్టిలో అందరికన్నా శ్రేష్టులనీ, తనకోసం అల్లా్‌హను ప్రార్థించనివాడు మూర్ఖుడైతే, సలాం చేయడంలో అలసత్వం వహించేవాడు అందరికన్నా లోభి అని అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్‌ స్పష్టం చేశారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 05:56 AM