Share News

Greek Language Gospel: సువార్తికుల్లో అగ్రగణ్యుడు

ABN , Publish Date - Jul 25 , 2025 | 03:02 AM

క్రీస్తు పిలుపును అందుకొని ఆయనను అనుసరించిన వారు ఎందరో ఉన్నారు. వారిలో జాన్‌ మార్క్‌ ఒకరు. అతను సువార్తికులలో ప్రసిద్ధి చెందినవాడు. క్రీస్తులోని దైవ, మానవ స్వభావాలను దర్శించి, చిత్రీకరించి...

Greek Language Gospel: సువార్తికుల్లో అగ్రగణ్యుడు

దైవమార్గం

క్రీస్తు పిలుపును అందుకొని ఆయనను అనుసరించిన వారు ఎందరో ఉన్నారు. వారిలో జాన్‌ మార్క్‌ ఒకరు. అతను సువార్తికులలో ప్రసిద్ధి చెందినవాడు. క్రీస్తులోని దైవ, మానవ స్వభావాలను దర్శించి, చిత్రీకరించి.... అద్భుతమైన రచనా శిల్పంతో లోకానికి అందించినవారిలో అగ్రగణ్యుడు. మార్కు అంటే ‘మహా యోధానుయోధుడు’ అర్థం.

మార్కు సువార్త 16 అధ్యాయాల గ్రంథం. దాన్ని ఆయన గ్రీకు భాషలో రాశాడు. కానీ ఏసు క్రీస్తు బోధలన్నీ అరమయిక్‌ భాషలో ఉన్నాయి. మరి గ్రీకు భాషలో వాటిని మార్కు ఎందుకు రాసినట్టు? ఆనాటి రోమన్‌ సామ్రాజ్యంలో... ముఖ్యంగా గలిలియా, అంతియోక్‌, ఉత్తర-దక్షిణ సిరియ్లాలోని జానపదుల వ్యవహారిక భాష గ్రీకు. కాబట్టే మార్కు సువార్తకు అంత వ్యాప్తి లభించింది. ‘సువార్త చతుష్టయం’గా పేరు పొందిన వారు ఏసు జీవితాన్ని సమగ్రంగా దర్శించినప్పటికీ... వాటిలో కొంత వైరుధ్యం కనిపిస్తుంది. మార్కు మాత్రం క్రీస్తు చేసిన అద్భుతాలవైపు దృష్టి సారించాడు. దైవపుత్రుడి పాత్రను తూచా తప్పకుండా నెరవేర్చిన వ్యక్తిగా క్రీస్తును ఆయన దర్శించాడు. మొదటి సువార్తికుడైన మత్తయి... క్రీస్తు బోధన మీద దృష్టి పెడితే... ఆ ప్రభువు సంచరించిన గలిలియా ప్రాంతంలో ఆయన చేసిన పరిచర్య, ప్రజలకు బాప్టిజం ఇవ్వడం, దైవరాజ్య వ్యాప్తి కోసం పరితపించడం, యేసుకు ఎదురైన శోధన, ఆయన మొదటి శిష్యుల సంగతులు, ఏసు ఎందరికో స్వస్థత కలిగించడం, తుపానును శాంతపరచడం, అయిదు వేలమందికి ఆహారం పెట్టడం, నీటి మీద నడవడం, ఏసు అంగీ అంచును తాకిన రోగులకు నయం కావడం, ఏసు తన మరణం గురించి ముందే తెలియజేయడం, ఆయన మరో రూప దర్శనం, స్వర్గారోహణ లాంటి ఎన్నో అంశాలు మార్కు సువార్తలో కనిపిస్తాయి. సౌవార్తికుడైన మార్కు చిహ్నం ‘రెక్కల సింహం’ అని యెహెజ్కేలు గ్రంథం పేర్కొంది.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 03:03 AM