Share News

Telangana Free Bus Service: మన మహాలక్ష్మి పెద్ద హిట్‌

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:02 AM

మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత చికిత్సకోసం ఆస్పత్రులకు వెళ్తున్న మహిళల సంఖ్య పెరిగింది.

Telangana Free Bus Service: మన మహాలక్ష్మి పెద్ద హిట్‌

‘మహాలక్ష్మి’... పద్ధెనిమిది నెలల కాలం... రెండు వందల కోట్లమంది ప్రయాణం... మహిళల కోసం తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం ఇది.

ఈ ప్రతిష్ఠాత్మక పథకం మహిళలను సాధికారత వైపు నడిపించిందంటున్నారు టీజీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎంలు... జె.శ్రీలత, ఎన్‌.సుచరిత.

దీనివల్ల ఆర్థిక స్థోమత లేనివారు సుదూర ప్రాంతాల్లో ఉన్న పెద్దాసుపత్రులకు కూడా వెళ్లి వైద్యం చేయించుకొనే అవకాశం లభించిందని...

ఇది శుభపరిణామమని చెబుతున్న అధికారులను ‘నవ్య’ పలుకరించింది.

ఆరోగ్య లక్ష్మి.. ఆనంద లక్ష్మి..

‘మహాలక్ష్మి’ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత చికిత్సకోసం ఆస్పత్రులకు వెళ్తున్న మహిళల సంఖ్య పెరిగింది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉచిత బస్సు సౌకర్యంతో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఆలయాలకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో మహాలక్ష్మి... ఆరోగ్య లక్ష్మి... ఆనంద లక్ష్మిగా మారింది. గతంలో బస్సు చార్జీలు భరించే స్థోమత లేకపోవడంతో జిల్లా కేంద్రాలు, పట్టణాలతోపాటు హైదరాబాద్‌లో ఉండే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునేందుకు మహిళలు వెనకాడేవారు. కానీ ఇప్పుడు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో... ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా జిల్లా కేంద్రాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పెద్దాసుపత్రులకు వెళుతున్నారు. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వేలో గతంతో పోలిస్తే ఈ ఏడాది, ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న మహిళా రోగుల సంఖ్య 31ు పెరిగినట్లు తేలింది. దీనికి ప్రధాన కారణం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. పెరిగిన మహిళా ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు బస్టాండ్లలో మరుగుదొడ్లు, తాగునీరు వసతి కల్పిస్తున్నాం. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, సీసీ కెమెరాల ఏర్పాటు చేశాం. మహిళా భద్రతా సిబ్బందిని నియమించాం.

BJKL.jpg

అరవై శాతానికి...

గతంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గరిష్టంగా 35ు వరకు ఉండేది. కానీ మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య 60 శాతానికి పెరిగింది. ప్రయాణికుల రద్దీని కంట్రోల్‌ చేసేందుకు రద్దీ ఉన్న మార్గాల్లో బస్సు సర్వీ్‌సలను పెంచాం. ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లలో బస్టాండ్‌ బయట ఉండేవారిని బస్టాండ్లలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. పెద్ద పెద్ద బస్టాండ్లలో మహిళా భద్రతా సిబ్బందిని పెంచాం. ఇమ్లిబన్‌లో 140 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. గతంలో సీసీ కెమెరాలు లేని పరిగి, వికారాబాద్‌ బస్టాండ్లలోనూ కొత్తగా సీసీ కెమెరాలు పెట్టాం. పండగలు, సెలవులు, రద్దీ సమయాల్లో జిల్లాల నుంచి బస్సులు సిటీలోకి రాకుండా వరంగల్‌, హన్మకొండ నుంచి వచ్చే బస్సుల్ని ఉప్పల్‌ నుంచి ఆపరేట్‌ చేస్తుంటాం.


నల్లగొండ వాళ్లు ఎల్బీనగర్‌ నుంచి ఆపరేట్‌ చేస్తుంటారు. ఎల్బీనగర్‌, ఆరంఘర్‌ ప్రాంతాల్లో మహిళా ప్రయాణికులకు సరిపడా వాష్‌రూమ్స్‌ సదుపాయాలు లేవు. ఏర్పాటు కోసం సంబంధిత విభాగాల అధికారులకు లేఖలు రాయడం జరిగింది. బస్టాండ్లలో మహాలక్ష్మి టాయ్‌లెట్‌లను ఏర్పాటు చేశాం. ఆర్టీసీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ బడ్జెట్‌ను పెంచడం జరిగింది. బడ్జెట్‌ పెంపుతో అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. దానికి అనుగుణంగా అన్ని బస్టాండ్లలో వసతులు మెరుగుపరుస్తాం.

మహిళా ప్రయాణికులు మార్గమధ్యంలో కాకుండా... సమీపంలోని బస్టాండ్‌ వరకు వచ్చి బస్సులు ఎక్కాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో జిల్లాల్లో ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం. కొందరు ఊర్లో బస్టాండులో బస్సు ఎక్కి... ఊరి చివర పొలాల వరకు ప్రయాణిస్తున్న విషయాల పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అలాంటి వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.

పోలీసలతో సమన్వయం...

పండగలు, సెలవులు, ప్రత్యేక సందర్భాల్లో బస్టాండ్లల్లో రద్దీ మరీ ఎక్కుగా ఉంటోంది. ఇలాంటి సందర్భాల్లో ఆర్టీసీతోపాటు పోలీస్‌ విభాగంతో సమన్వయం చేసుకుని పని చేస్తాం. ఫలితంగా బస్టాండ్లలో అనవసర ట్రాఫిక్‌ జామ్‌లతోపాటు ప్రయాణికుల భద్రతకు భరోసా ఉంటుంది. ఎక్కడెక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని పోలీసలకు వివరించి అదనపు భద్రత కోరుతున్నాం. కో-ఆర్డినేషన్‌ సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై చర్చిస్తున్నాం. రద్దీ మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచి నడుపుతున్నాం. భవిష్యత్తులో డిమాండ్‌ మేరకు ఆయా మార్గాల్లో బస్సు సర్వీ్‌సల్ని మరింత పెంచుతాం. విద్యుత్‌ బస్సుల్ని ఎంపిక చేసిన మార్గాల్లో ఎక్కువగా తిప్పుతున్నాం.

- జె.శ్రీలత

రంగారెడ్డి జిల్లా రీజనల్‌ మెనేజరు (ఆర్‌ఎం)


XBF.jpg

ఆర్థిక పురోగతి...

ఒకప్పుడు ప్రయాణికుల కోసం ఆర్టీసీ సిబ్బంది బస్టాండ్లలో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్టీసీ బస్సు కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా కొత్త బస్సులు, రద్దీ మార్గాల్లో సర్వీ్‌సలను పెంచడం జరిగింది. బస్సుల్లో ఆక్సుపెన్సీ రేషియో గతంలో అత్యఽధికంగా 68ు వరకు ఉండగా ప్రస్తుతం 105ుకిపైగా పెరిగింది. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా సాధికారత పెరిగింది. మహిళా చిరుద్యోగులకు ఉచిత బస్సు సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంది. మహిళా ప్రయాణికులతో మాట్లాడిన సమయంలో వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ప్రయాణికులు లేకపోవడంతో ట్రిప్పులు రద్దు చేసేవాళ్లం. ఇప్పుడు అదనపు ట్రిప్పులు వేస్తున్నాం. షటిల్‌ బస్సుల నిర్వహణ, స్పేర్‌లో ఉన్న బస్సుల్ని నడుపుతున్నాం. మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో రద్దీ సమయాల్లో పురుష ప్రయాణికుల కోసం మెట్రోడీలక్స్‌ సర్వీ్‌సల్ని పెంచాం. ఈ సర్వీ్‌సల్లో మహిళలు సైతం ప్రయాణిస్తున్నారు.

రోజుకు 20 లక్షలు...

గతంతో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో రోజుకు 20 లక్షల మంది ప్రయాణికులు పెరిగారు. గతంలో ఆటోలు, మెట్రోలు, ఇతర రవాణా మార్గాల్లో ప్రయాణించే వారు ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణానికే ఆసక్తి చూపిస్తున్నారు. బస్సు ప్రయాణం సురక్షితం కావడంతో ఇటువైపు ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కేవలం అక్కడి వరకే పరిమితం చేసి చూడాల్సిన అంశం కాదు. దీనివల్ల ఆర్థిక పురోగతి ఏర్పడింది. మహిళలు ముఖ్యంగా గృహిణులు ఆలయాల సందర్శనకు వెళ్తున్నారు. దాంతో స్థానికంగా ఉండే చిరు వ్యాపారులకు ఆదాయం పెరిగింది. కొందరు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో కొత్తగా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించారు. ఇలా అనేక రకాలుగా ఉచిత బస్సు ప్రయాణం నిరుపేద, పేద కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా మారింది. సమాజాభివృద్ధిలో మహాలక్ష్మి పథకం ఎంతో కీలకంగా మారింది.

టాయ్‌లెట్‌ బ్లాక్స్‌...

ఏడాదిన్నర కాలంలో మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో అప్పుడు మహిళా ప్రయాణికుల్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన టాయ్‌లెట్స్‌ ఇప్పుడు ఏ మాత్రం సరిపోని పరిస్థితి. దీంతో అన్ని బస్టాండ్లలో మహాలక్ష్మి టాయ్‌లెట్‌ బ్లాక్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. పనులు ముగించుకుని ఇంటికి తిరిగివెళ్లే సమయాల్లో రాత్రివేళ బస్టాండ్లలో మహిళా ప్రయాణికుల కోసం... విద్యుత్‌ దీపాల సదుపాయం మెరుగుపర్చడంతోపాటు సీసీ కెమెరాల సంఖ్య పెంచాం.

- ఎన్‌.సుచరిత,

సికింద్రాబాద్‌ రీజినల్‌ మెనేజరు

ఫ యస్‌.సోమేశ్వర్‌


ఇవి కూడా చదవండి

ర్యాపిడో ఎక్కి భయపడ్డ యువతి.. కొద్దిసేపటి తర్వాత..

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోమ్ డ్రింక్స్ మీ కోసమే.!

Updated Date - Jul 24 , 2025 | 12:02 AM