Fighting Depression: మెగ్నీషియం మతలబు ఇదే
ABN , Publish Date - Aug 05 , 2025 | 03:28 AM
కండరాల పటుత్వాన్ని పెంచే పోషకంగా మెగ్నీషియంను పరిగణిస్తూ ఉంటాం. అయితే ఈ మూలకానికి మానసిక కుంగుబాటును దూరం చేసే ప్రభావం కూడా ఉంటుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది...
తెలుసుకుందాం
కండరాల పటుత్వాన్ని పెంచే పోషకంగా మెగ్నీషియంను పరిగణిస్తూ ఉంటాం. అయితే ఈ మూలకానికి మానసిక కుంగుబాటును దూరం చేసే ప్రభావం కూడా ఉంటుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
సాధారణంగా మానసిక కుంగుబాటుకు గురైన వారు చికిత్స కోసం మానసిక వైద్యులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే కొందరికి ఇలాంటి సంప్రదాయ చికిత్సలు ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో గ్లైసినేట్ లేదా థ్రియోనేట్ రూపాల్లోని మెగ్నీషియం ఎంతో అక్కరకొస్తుందని వైద్యపరమైన ప్రయోగాల్లో వెల్లడైంది. ఆందోళన, ఒత్తిడులను తగ్గించి, నిద్ర నాణ్యతను పెంచే శక్తి మెగ్నీషియంకు ఉంటుందనీ, సంప్రదాయ యాంటీడిప్రెసెంట్లు పని చేయని సందర్భాల్లో, మెగ్నీషియంను ఆశ్రయించవచ్చనీ పరిశోధకులు సూచిస్తున్నారు. మానసిక కుంగుబాటుకు మెదడులోని రసాయన మార్పులు కూడా ఒక కారణమే! ఇలాంటి సందర్భాల్లో మెదడులోని రిసెప్టార్లు ఎక్సైటోటాక్సిసిటీ అనే ప్రక్రియలో భాగంగా ప్రమాదకరమైన స్థాయిలో అతిగా స్పందిస్తూ ఉంటాయి. ఇలాంటి రోగులు మెగ్నీషియం తీసుకున్నప్పుడు, అది నాడీకణాలకు రక్షణ కవచంగా మారి రసాయన ప్రభావాలను అడ్డుకుని నాడీ కణాలు అతిగా స్పందించే ప్రక్రియ నెమ్మదిస్తుంది. అయితే మన శరీరాల్లో సహజసిద్ధంగా మెగ్నీషియం ఉంటున్నప్పుడు, ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? అనే అనుమానం రావచ్చు. నిజానికి మన ఆధునిక ఆహారపుటలవాట్లే మెగ్నీషియం లోపానికి ప్రధాన కారణమని వైద్యులంటున్నారు. ప్రాసెస్ చేసిన పదార్థాలు, ఫిల్టర్ చేసిన నీళ్లు మనలో మెగ్నీషియం లోపానికి దోహద పడుతున్నాయి. ఫలితంగా మెదడు ప్రభావితమవుతూ మానసిక కుంగుబాటు, నాడీకణాల క్షీణత లాంటి రుగ్మతలు పెరుగుతున్నాయి. కాబట్టి సమతులాహారం ద్వారా ఈ పోషక లోపాన్ని నివారించుకుని, మానసిక కుంగుబాటుకు అడ్డుకట్ట వేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News