గంజి తాగుదాం..!
ABN , Publish Date - Feb 27 , 2025 | 05:36 AM
గంజి సహజ ఔషధమని నిపుణులు చెబుతున్నారు. దీనిని తాగడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం....
గంజి సహజ ఔషధమని నిపుణులు చెబుతున్నారు. దీనిని తాగడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
గంజిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వ్యాయామం చేసిన తరవాత, నీరసంగా అనిపించినప్పుడు ఒక గ్లాసు గంజి తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.
ప్రతిరోజూ గంజి తాగడంవల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మలబద్దకం దూరమవుతుంది. పొట్ట సమస్యలు రావు.
వేసవికాలంలో తరచూ గంజి తాగుతూ ఉంటే వడదెబ్బ తగలదు. ఒక గ్లాసు గంజిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. డయేరియాను నిరోధిస్తుంది.
గంజిలో బి 1, బి 2, బి 6 విటమిన్లతోపాటు మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ ఉంటాయి. ఇవి జీవక్రియలను వేగవంతం చేయడంతోపాటు మెదడు పనితీరుని క్రమబద్దీకరిస్తాయి.
గంజి తాగడం వల్ల చర్మానికి తేమ అంది ఆరోగ్యంగా కనిపిస్తుంది. మొటిమలు, గుల్లలు రాకుండా ఉంటాయి. శిరోజాలు చక్కగా పెరుగుతాయి.
గంజిలో ఉండే పోటాషియం శరీరంలో సోడియం స్థాయిని నియంత్రిస్తుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.
గంజిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అనారోగ్యంతో ఉన్నప్పుడు గంజి తాగితే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
Also Read: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
Also Read: TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది
Also Read: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..
For AndhraPradesh News And Telugu News