Nutrient Deficiencies: పోషక లోపాలు లక్షణాల రూపంలో
ABN , Publish Date - Nov 25 , 2025 | 02:19 AM
పోషక లోపాలు లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే! అయితే లక్షణాల ఆధారంగా పోషక లోపాలను గ్రహించే విషయంలో మనం పొరపాటు పడుతూ...
తెలుసుకుందాం
పోషక లోపాలు లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే! అయితే లక్షణాల ఆధారంగా పోషక లోపాలను గ్రహించే విషయంలో మనం పొరపాటు పడుతూ ఉంటాం. వాటిని కచ్చితంగా ఎలా కనిపెట్టాలంటే...
మెగ్నీషియం: కండరాల నొప్పులకు కారణం మెగ్నీషియం లోపంగా భావిస్తాం. అయితే మెగ్నీషియం లోపం ప్రధానంగా ఒక లక్షణం ద్వారా బయల్పడుతుంది. కన్ను పదే పదే అదురుతూ ఉంటే, దాన్ని మెగ్నీషియం లోపంగా పరిగణించాలి. మెగ్నీషియం 300 రకాల స్పందనలను, ప్రత్యేకించి కండరాలు, నాడుల స్పందనలను క్రమబద్ధీకరిస్తుంది.
విటమిన్ డి: ఎముకల బలహీనత ద్వారా ఈ పోషకలోపం బయల్పడుతుందని భావిస్తాం. కానీ రుతుపరమైన విచారం విటమిన్ డి లోపంగా పరిగణించాలి. విటమిన్ డి... విటమిన్ కంటే ఎక్కువగా హార్మోన్‌గా పని చేస్తూ, సెరటోనిన్ హార్మోన్‌ను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి శరీరానికి ఎండ సోకకపోతే, సెరటోనిన్ విడుదలకు సిగ్నల్ అందక, విచారం వేధిస్తుంది
విటమిన్ బి12: శక్తి సన్నగిల్లితే విటమిన్ బి12 లోపంగా భావిస్తాం. అయితే, చేతులు, అరికాళ్లలో తిమ్మిర్లు ఈ పోషకలోపం ప్రధాన సంకేతం. బి12, కొవ్వు, ప్రొటీన్‌తో కూడిన నాడీ పైపొర అయిన మైలిన్ షీత్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే, నాడీ సంకేతాలు గాడి తప్పి షార్ట్‌సర్క్యూట్ అవుతూ ఉంటాయి. ఫలితంగా తిమ్మిర్లు వేధిస్తాయి
ప్రొటీన్: ఈ లోపం వల్ల కండరాలు క్షీణిస్తాయని అనుకుంటాం. నిజానికి ఈ లోపం నిరంతర ఆకలి రూపంలో బయల్పడుతుంది. ప్రొటీన్ ఆకలితో ముడిపడి ఉండే గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లను నియంత్రిస్తుంది. కాబట్టి ఈ పోషకం తగ్గినప్పుడు, ఆకలి పెరుగుతుంది
జింక్: జుట్టు రాలడం ఈ పోషకలోపం ప్రధాన లక్షణం కాదు. రుచి, వాసనలను కోల్పోవడం ఈ పోషకలోపం ప్రధాన లక్షణాలు. ఇంద్రియ రిసెప్టార్లు, వ్యాధినిరోధకశక్తికీ జింక్ కీలకం. ఈ పోషకం లోపిస్తే, ఇంద్రియాలు సామర్థ్యం కోల్పోతాయి
ఈ వార్తలు కూడా చదవండి..
ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News