Share News

Jewellery Care Tips: మీ ఆభరణాలు నల్లగా మారాయా.. ఈ చిట్కాలతో వాటిని మెరిసేలా చేయండి..

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:27 AM

అమ్మాయిలు ఆభరణాలను ఎంతో ఇష్టంగా కొనుకుంటారు. కొంత కాలానికి అవి నల్లగా మారిపోతే బాధపడతారు. అయితే, ఈ చిట్కాలతో వాటిని మెరిసేలా చేసుకోవచ్చు.. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Jewellery Care Tips: మీ ఆభరణాలు నల్లగా మారాయా.. ఈ చిట్కాలతో వాటిని మెరిసేలా చేయండి..
Jewellery Care

Jewellery Care Tips: చాలా మంది అమ్మాయిలు ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు. ఫంక్షన్ ఏదైనా సరే తాము ధరించే ఆభరణాలతో స్పెషల్‌గా కనిపించాలని ఎన్ని షాప్స్ అయినా సరే తిరిగి నచ్చిన వాటిని తీసుకుంటారు. అయితే, ఎంతో ఇష్టంగా ఆభరణాలు కొన్నప్పటికి కొంతకాలానికి అవి నల్లగా మారిపోతాయి. ఇది ఇబ్బందికి కారణం అవుతుంది. అయితే, మీ ఆభరణాలు కూడా నల్లగా మారాయా? మీరు చింతించాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన చిట్కాలతో మీ ఆభరణాలను కొత్తగా కనిపించేలా చేయవచ్చు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బేకింగ్ సోడా..

ఆభరణాలు కొత్తవిగా కనిపించడానికి మీరు బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. దీని కోసం, మీరు ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా తీసుకొని దానిలో కొంచెం నీరు వేసి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. పాత టూత్ బ్రష్ లేదా మెత్తని గుడ్డ సహాయంతో, ఈ పేస్ట్‌ను అప్లై చేసి ఆభరణాలపై సున్నితంగా రుద్దాలి. కొంత సమయం తర్వాత ఆభరణాలను శుభ్రమైన నీటితో కడగాలి.

వెనిగర్..

వెనిగర్, నీటిని సమాన పరిమాణంలో తీసుకొని పేస్ట్ సిద్ధం చేయాలి. ఈ పేస్ట్‌ను పాత టూత్ బ్రష్‌పై అప్లై చేసి ఆభరణాలపై 5 నుంచి 10 నిమిషాల పాటు రుద్దాలి. దీని తర్వాత మీరు శుభ్రమైన నీటితో వాటిని కడగాలి. నీటితో కడిగిన తర్వాత, శుభ్రమైన గుడ్డ సహాయంతో ఆభరణాలను తుడవండి. సరిగ్గా శుభ్రం చేసినప్పుడు తేడాను మీరే చూడవచ్చు.


టూత్‌పేస్ట్..

పాత టూత్ బ్రష్‌పై కొద్దిగా టూత్‌పేస్ట్ రాసి ఆభరణాలపై సున్నితంగా రుద్దండి. కొంత సమయం తర్వాత ఆభరణాలను నీటితో కడగాలి. తర్వాత శుభ్రమైన గుడ్డ తీసుకొని నగలను తుడవండి.

డిష్ వాష్ లిక్విడ్‌

ఆభరణాలు కొత్తవిగా కనిపించడానికి మీరు డిష్ వాష్ లిక్విడ్‌ కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, మీరు డిష్ వాష్ లిక్విడ్‌లో మెత్తని గుడ్డను ముంచి ఆభరణాలపై తేలికగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆభరణాల నలుపు పోయి కొత్తదనం వస్తుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఆభరణాలను శుభ్రపరిచేటప్పుడు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ తడిగా ఉన్న బ్రష్‌ని ఉపయోగించడం, కఠినమైన రసాయనాలను నివారించడం, మృదువైన వస్త్రాన్ని ఉపయోగించడం, ఆభరణాలను ఎక్కువగా రుద్దడం వంటివి చేయవద్దు. పై చిట్కాల సహాయంతో, మీరు ఆభరణాల నల్లదనాన్ని సులభంగా తొలగించి, కొత్తదిగా చేసుకోవచ్చు.

Updated Date - Jan 25 , 2025 | 11:47 AM