Share News

జేఈఈ(మెయిన్‌) 2025 జనవరి సెషన్‌ బెటర్‌

ABN , Publish Date - Jan 06 , 2025 | 06:48 AM

దేశవ్యాప్తంగా ఇంటర్మీడియేట్‌(ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్థులు బీటెక్‌, బీఆర్క్‌/బీ డిజైన్‌ కోర్సుల్లో ప్రతిష్ఠాత్మక ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఎస్‌ఏపీ లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఎన్‌టీఏ నిర్వహించే జేఈఈ(మెయిన్‌) ప్రవేశ పరీక్ష...

జేఈఈ(మెయిన్‌) 2025 జనవరి సెషన్‌ బెటర్‌

జేఈఈ(మెయిన్‌) 2025 జనవరి సెషన్‌ బెటర్‌

దేశవ్యాప్తంగా ఇంటర్మీడియేట్‌(ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్థులు బీటెక్‌, బీఆర్క్‌/బీ డిజైన్‌ కోర్సుల్లో ప్రతిష్ఠాత్మక ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఎస్‌ఏపీ లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఎన్‌టీఏ నిర్వహించే జేఈఈ(మెయిన్‌) ప్రవేశ పరీక్ష ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా రెండు దఫాలుగా అంటే జనవరి, ఏప్రిల్‌ల్లో నిర్వహిస్తున్నారు. జనవరి సెషన్‌కి సంబంధించి అప్లికేషన్‌ ప్రాసెస్‌ ఈపాటికే పూర్తయింది. దాదాపు 13.6 లక్షలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏప్రిల్‌ సెషన్‌కి సంబంధించి అప్లికేషన్‌ ప్రాసెస్‌ జనవరి 31, 2025 నుంచి ఫిబ్రవరి 24 వరకు ఉంటుంది. జనవరి సెషన్‌కి దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ తేదీలను గుర్తుపెట్టుకోవాలి.

  • జనవరి 22 నుంచి 31 వరకు జరిగే కంప్యూటర్‌ ఆధార పరీక్షలో ప్రధానంగా చాయిస్‌ ప్రశ్నలను తీసివేశారు. అంటే గతంలో సబ్జెక్టుకి పార్ట్‌-బిలో 10 ప్రశ్నల్లో అయిదు అటెంప్ట్‌ చేస్తే సరిపోయేది. కానీ ఈ సంవత్సరం అయిదింటికి అయిదు అటెంప్ట్‌ చేయాలి. అంటే ప్రతి సబ్జెక్టుకి 25కి 25 అటెంప్ట్‌ చేయాల్సి ఉంటుంది. చాయిస్‌ ఉండదు.

  • ఈ సందర్భంగా చాలామంది విద్యార్థులు జనవరి లేదా ఏప్రిల్‌లో ఏ సెషన్‌ని సీరియ్‌సగా తీసుకోవాలనే సందిగ్ధంలో ఉంటారు. ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు ఫిబ్రవరిలో ఇం టర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు, మార్చిలో బోర్డ్‌ పరీక్షలు రాయడంలో హడావుడిగా ఉంటారు. కాబట్టి వారికి జనవరి సెషన్‌ బెటర్‌ ఎందుకంటే వీరికి బోర్డు పరీక్షలు అయిన తరువాత జేఈఈ(మెయిన్‌) ఏప్రిల్‌ సెషన్‌కి సమయం లభించేది చాలా తక్కువ. అదే ఇంటర్‌ పూర్తిచేసుకుని లాంగ్‌టర్మ్‌ ప్రిపరేషన్‌లో ఉన్న విద్యార్థులు ఏ సెషన్‌ అయినా సీరియ్‌సగా తీసుకోవచ్చు.


ఈ టిప్స్‌తో విద్యార్థులు మంచి పర్సంటైల్‌ స్కోరును సాధించవచ్చు.

1. సిలబ్‌సపై అవగాహన

ఎ) విద్యార్థి పరీక్ష విధానం, మార్కింగ్‌ స్కీమ్‌, వెయిటేజ్‌ టాపిక్స్‌పై పూర్తి అవగాహనతో ఉండాలి.

బి) ఎక్కువ వెయిటేజ్‌ ఉన్న టాపిక్స్‌/ చాప్టర్స్‌పై దృష్టి సారించాలి.

2. సరైన ప్రణాళిక

ఎ) విద్యార్థి ప్రతి సబ్జెక్టుకి నిర్ణీత సమయాన్ని కేటాయించి, దానిప్రకారం ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి.

బి) ముఖ్యమైన టాపిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

సి) చదువు, విశ్రాంతికి మధ్య సరైన సమయాన్ని కేటాయించుకోవాలి.

3. రివైజ్‌- ప్రాక్టీస్‌

ఎ) ఎన్‌సీఈఆర్‌టీ, ఇంటర్‌ పాఠ్య పుస్తకాల్లో ఉన్న సమ్మరీని సమగ్రంగా రివైజ్‌ చేయాలి.

బి) విద్యార్థి తనకు పట్టున్న చాప్టర్లు, టాపిక్స్‌ను ఎక్కువ ప్రాక్టీస్‌ చేయాలి.

4. నమూనా పరీక్షలు

ఎ) గత సంవత్సరం ప్రశ్నపత్రాలను విరివిగా సాల్వ్‌ చేయాలి.

బి) మాక్ట్‌టె్‌స్టను రాయడం ద్వారా పరీక్ష భయాన్ని అధిగమించవచ్చు.


5. సమయ పాలన

ఎ) ప్రాక్టీస్‌, మాక్‌టెస్ట్‌ సమయంలో నిర్ణీతమైన టైమ్‌లైన్‌ పాటించాలి. ప్రతి ప్రశ్నకు రెండు లేదా మూడు నిమిషాల సమయం ఉంటుంది. కాబట్టి తొందరపాటు లేకుండా అటెంప్ట్‌ చేయాలి. దీనివల్ల నెగెటివ్‌ మార్కులను తగ్గించవచ్చు.

బి) ముదట క్లిష్టమైన ప్రశ్నలను వదిలేసి, బాగా తెలిసిన వాటిపై దృష్టి సారించడం ద్వారా మీకు మనోనిబ్బరం తగ్గకుండా ఉంటుంది.

6. క్లాస్‌రూమ్‌ నోట్స్‌

ప్రిపరేషన్‌ రోజుల్లో విద్యార్థి ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ/ గత ప్రశ్నపత్రాలపై ఆధారపడాలి. మీ క్లాస్‌రూమ్‌ నోట్స్‌ అనేది రివిజన్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.

7. ఫార్ములాస్‌ రివిజన్‌

ఎ) అన్ని ముఖ్యమైన ఫార్ములాలు, ఒకచోట పెట్టుకుని ప్రతిరోజూ రివైజ్‌ చేయాలి.

బి) వీలైతే దీనికి సంబంధించి బ్రీఫ్‌ నోట్స్‌ తయారు చేసుకోవాలి.

8. సమగ్ర విశ్లేషణ

ఎ) ప్రతి మాక్‌టెస్ట్‌ అయ్యాక తప్పొప్పులుపై దృష్టి సారించాలి.

బి) రెగ్యులర్‌గా అడిగే కాన్సె్‌ప్టలను ఎక్కువగా రివైజ్‌ చేయాలి. గెస్‌వర్క్‌ను పూర్తిగా అవాయిడ్‌ చేయాలి.

9. పాజిటివ్‌ ఆలోచనలు

ఎ) విద్యార్థి ఈ దశలో మాడిఫైడ్‌గా ఉండాలి. అసలు నెగెటివ్‌ ఆలోచనలను దరికి రానివ్వద్దు.

బి) మీ చుట్టూ సహ విద్యార్థులు, లెక్చరర్స్‌ ఉండటంతో పోటీ వాతావరణం ఉంటుంది. అయితే ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.

10. ఆరోగ్యం ముఖ్యం

ఎ) స్టడీ సెషన్స్‌ మధ్య సరైన బ్రేక్స్‌ ఉండాలి

బి) ఆహారం, నిద్ర అనేది మెదడును ఫ్రెష్‌గా ఉంచుతుంది.

సి) వీలైతే మెడిటేషన్‌, యోగ చేయాలి.

డి) మీ శరీరం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.

చివరిగా ఈ పరీక్షలో విజయం సాధించాలంటే హార్డ్‌వర్క్‌తోపాటు, ఆక్యురసీ, సమయపాలనపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి.

డాక్టర్‌ పవన్‌కుమార్‌ కాసు

సంజీవిని ఐఐటీ అకాడమీ

Updated Date - Jan 06 , 2025 | 06:48 AM