Share News

Knee pain : కీళ్ల నొప్పులు తగ్గేదెలా?

ABN , Publish Date - Feb 05 , 2025 | 11:48 PM

డాక్టర్‌! నా వయసు 50. గత కొన్ని నెలలుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. ఇందుకు కారణం కీళ్ల అరుగుదలగా భావించాలా? ఈ సమస్య మరింత పెరగకుండా ఎలా నియంత్రించుకోవాలి?

Knee pain : కీళ్ల నొప్పులు తగ్గేదెలా?

డాక్టర్‌! నా వయసు 50. గత కొన్ని నెలలుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. ఇందుకు కారణం కీళ్ల అరుగుదలగా భావించాలా? ఈ సమస్య మరింత పెరగకుండా ఎలా నియంత్రించుకోవాలి?

ఓ సోదరి, హైదరాబాద్‌

మోకీళ్ల అర్ర్థైటిస్‌కు 5 వ్యాయామాలు!

క్వాడ్రాసెప్స్‌ స్ర్టెచ్‌

కాఫ్‌ స్ట్రెచ్‌

సీటెడ్‌ లెగ్‌ రైజ్‌

వ్యక్తిగత, వైద్యచరిత్రల ఆధారంగా అరిగిన, అరుగుతున్న కీళ్లకు ఎలాంటి చికిత్సను అందించాలో వైద్యులు నిర్ణయించుకుంటూ ఉంటారు. ఒకే ఒక పరీక్షతో కీళ్ల అరుగుదలను నిర్థారించే పరిస్థితి ఇప్పటివరకూ లేదు. లక్షణాలు, ఎక్స్‌ రే, ఎమ్మారైల ద్వారా సమస్యను నిర్థారించే విధానమే మనుగడలో ఉంది. ఫలితాలను బట్టి అంచెల వారీగా అందించవలసిన చికిత్సను వైద్యులు అంచనా వేస్తూ ఉంటారు. ప్రధాన కారణాలు ఇవే!

పెరిగే వయసు

స్థూలకాయం

ప్రమాదాల్లో కీళ్లు దెబ్బతినడం

ప్రధానంగా వంశపారంపర్యం లేదా జన్యుపరమైన అంశాలు నియంత్రణ ఇలా...


బరువు అదుపులో: అధిక బరువు మోకీళ్ల మీద భారాన్ని పెంచుతుంది. అధిక బరువుతో మోకీళ్లు, తుంటి, పాదాల్లోని కీళ్లు శ్రమకు లోనవుతాయి. అలాగే అదనపు కొవ్వు మృదులాస్థిలో మార్పులకు కారణమవుతుంది. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవాలి. అధిక బరువును ఆహార, జీవనశైలి మార్పులతో తగ్గించుకోవాలి.

మధుమేహం: రక్తంలో పెరిగే చక్కెర స్థాయిలు కీళ్ల అరుగుదలకు కారణమవుతాయి. కాబట్టి మధుమేహులు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించుకుంటూ ఉండాలి. అవసరం మేరకు మందులు వాడుకుంటూ ఉండాలి.

చురుగ్గా ఉండాలి: కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శరీరం చురుగ్గా ఉండాలి. వ్యాయామంతో కీళ్లు బిగుసుకుపోయే సమస్య తప్పుతుంది. కాబట్టి రోజూ కనీసం 30 నిమిషాల పాటైనా నడవాలి. కీళ్ల అరుగుదలను నియంత్రించే వ్యాయామాల గురించి వైద్యులను అడిగి తెలుసుకోవాలి.

వ్యాయామాలు సురక్షితంగా: గాయాలు కీళ్ల అరుగుదలను పెంచుతాయి. కాబట్టి వ్యాయామం మొదలుపెట్టే వాళ్లు తక్కువ వేగంతో, తక్కువ తీవ్రతతో వ్యాయామాలు మొదలుపెట్టి, క్రమేపీ వేగం, తీవ్రతలను పెంచాలి. వ్యాయామానికి ముందు 10 నిమిషాల పాటు వార్మప్‌ చేయడం వల్ల, కీళ్లు, టెండాన్లు, కండరాలు, లిగమెంట్లు గాయాల బారిన పడకుండా ఉంటాయి.

కీళ్ల మీద కన్ను: వ్యాయామం చేసిన ఒకటి రెండు గంటల తర్వాత కూడా కీళ్లు నొప్పి పెడుతూ ఉంటే అవసరానికి మించి కీళ్లను శ్రమకు లోను చేశామని అర్థం. అలాంటప్పుడు నొప్పి తగ్గడం కోసం ఐస్‌ ప్యాక్‌ పెట్టుకోవాలి.

తీపి, ఉప్పు: ఆహారంలో ఈ రెండింటి వాడకం వీలైనంత తగ్గించాలి.

డాక్టర్‌. కృష్ణ సుబ్రమణ్యం,

ఆర్థోపెడిక్‌, జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ సర్జన్‌, హైదరాబాద్‌.

Updated Date - Feb 05 , 2025 | 11:48 PM