Share News

విజయ గీతిక

ABN , Publish Date - Jun 05 , 2025 | 06:13 AM

క్రీడా పోటీల్లో మన క్రీడాకారులు పతకాలు సాధించినప్పుడు ఎంతో ఉప్పొంగిపోతాం. ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి క్రీడాకారులను ఎంతో ప్రశంసిస్తాం...

విజయ గీతిక

క్రీడా పోటీల్లో మన క్రీడాకారులు పతకాలు సాధించినప్పుడు ఎంతో ఉప్పొంగిపోతాం. ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి క్రీడాకారులను ఎంతో ప్రశంసిస్తాం.

మరి మైదానంలోని ఆ క్రీడాకారులను ఫొటోలను మనకు అందించిన ఫొటోగ్రాఫర్లు మాత్రం చాలామందికి తెలియదు. అలాంటి ఓ ఫొటోగ్రాఫర్‌...

గీతికా తాలుక్‌దర్‌. ఒలంపిక్స్‌ను కవర్‌ చేసే అవకాశం పొందిన తొలి భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్‌ అయిన ఆమె గురించి ఆసక్తికర విషయాలు...

ఐఎస్‌ఎల్‌ (ఇండియన్‌ సూపర్‌ లీగ్‌) టోర్నీలు, ఫిఫా మహిళల ప్రపంచకప్‌లు, ఫిఫా ప్రపంచ కప్‌లు, సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌, ఐసీసీ వరల్డ్‌ కప్‌ వంటి ఎన్నో క్రీడా కార్యక్రమాలను ఆమె కవర్‌ చేసి పేరు తెచ్చుకున్నారు. 2020 టొక్యో ఒలంపిక్స్‌, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఎన్నో చిత్తరువులు తీశారు.

పనిని ప్రేమిస్తా...

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మహిళా ఫొటోగ్రాఫర్లలో నేను కూడా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. పారిస్‌ ఒలంపిక్స్‌ కవర్‌ చేసేందుకు ఒలింపిక్స్‌ కమిటీ నుంచి అక్రిడేషన్‌ పొందడం నా జీవితంలోనే మరిచిపోలేని రోజు. నేను నా పనిని ప్రేమిస్తాను. పని చేస్తున్నప్పుడు ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తాను.


అసోం గువహటికి చెందిన గీతిక తన తాతయ్య స్ఫూర్తితో చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీపై ఇష్టం పెంచుకుంది. చదువు పూర్తి చేసుకుని 2006లో ఫొటో జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించింది. పలు మీడియా సంస్థల్లో ఫొటో జర్నలిస్ట్‌గా పని చేసింది. ఫొటో జర్నలిజం అనగానే మనకు ఎక్కువగా కనిపించేది మగవారే. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ ఎక్కడో కానీ మహిళా ఫొటోగ్రాఫర్లను చూడలేం. ‘‘ఇక నేను కెమెరా పట్టుకుని, దాన్నే కెరీర్‌గా ఎంచుకొనే నాటికి పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండేవి. ఎక్కడకు వెళ్లినా నేను తప్ప మరొక మహిళా ఫొటోగ్రాఫర్‌ కనిపించేది కాదు. అడుగడుగునా ఎన్నో సవాళ్లు ఎదురయ్యేవి. బంధువులు, సన్నిహితులు కూడా... ‘ఈ ఫొటోగ్రపీ నీకు అవసరమా’ అంటూ నిరుత్సాహపరిచేవారు’’ అంటూ నాటి జ్ఞాపకాలను పంచుకున్న గీతిక ఏ రోజూ వెనకడుగు వేయలేదు. ఎవరు ఏమన్నా తనకు నచ్చిన రంగంలోనే కొనసాగాలని బలంగా నిర్ణయించుకుంది. తనను తాను నిరూపించుకోవడానికి, పొటోగ్రాఫర్‌గా నిలదొక్కుకోవడానికి అహర్నిశలూ శ్రమించింది. ఫొటోగ్రాఫర్‌ అంటే ఎన్నో ప్రాంతాలు తిరగాలి. గంటలకొద్దీ నిలబడే ఉండాలి. రాత్రీ, పగలూ అనే తేడా లేకుండా పనిచేయాలి. వీటిలో దేనికీ ఆమె భయపడలేదు. అందుకే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి, తొలి భారతీయ మహిళా క్రీడా ఫొటోగ్రాఫర్‌గా చరిత్రలో స్థానం దక్కించుకున్నారు.

ఎన్నో క్రీడలు.. చిత్తరువులు...

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ క్రీడా టోర్నీల్లో గుర్తుండిపోయే అపురూప క్షణాలను గీతిక తన కెమెరాలో బంధించారు.

2007లో నేషనల్‌ గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, పలు ఐపీఎల్‌,

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 06:13 AM