Share News

Handwriting Tips: పిల్లల చేతి రాత అందంగా

ABN , Publish Date - Aug 04 , 2025 | 03:31 AM

కొంతమంది పిల్లల చేతిరాత అంత అందంగా ఉండదు. అక్షరాలను ఒక క్రమంలో కాకుండా ఎగుడు దిగుడుగా, కొన్నింటిని పెద్దగా మరికొన్నింటిని చిన్నగా రాస్తుంటారు. ఎంత బాగా...

Handwriting Tips: పిల్లల చేతి రాత అందంగా

కొంతమంది పిల్లల చేతిరాత అంత అందంగా ఉండదు. అక్షరాలను ఒక క్రమంలో కాకుండా ఎగుడు దిగుడుగా, కొన్నింటిని పెద్దగా మరికొన్నింటిని చిన్నగా రాస్తుంటారు. ఎంత బాగా చదివినప్పటికీ చేతిరాత సరిగా లేకపోతే పరీక్షల్లో మార్కులు కూడా తగ్గుతుంటాయి. అలాకాకుండా పిల్లల చేతిరాత చక్కగా ఉండాలంటే తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...

  • ముందుగా పిల్లలు పెన్సిల్‌ను ఎలా పట్టుకుంటున్నారో పరిశీలించాలి. చూపుడు వేలు, మధ్యవేలు, బొటనవేలు మధ్య పెన్సిల్‌ సరిగా అమరేలా చూడాలి. ఈ మూడు వేళ్లతో పెన్సిల్‌ను గట్టిగా పట్టుకోవడం నేర్పించాలి. చాలామంది పిల్లలు పెన్సిల్‌ను చూపుడు వేలు, బొటనవేలుతో మాత్రమే పట్టుకుంటూ ఉంటారు. దీనివవల్ల సరైన గ్రిప్‌ దోరకక చేతిరాత సరిగా రాదు.

  • పిల్లలకు అక్షరాలను సరళరేఖ వెంబడి ఒకే రీతిలో రాయడం నేర్పించాలి. రూల్డ్‌ నోట్‌బుక్స్‌లో రాస్తూ ఉంటే కొద్ది రోజుల తరవాత తెల్ల కాగితం మీద కూడా చక్కగా రాయడం వస్తుంది.

  • అరచేతులు, వేళ్లు వేగంగా కదిలిస్తూ చేసే పనులను పిల్లలకు చెప్పి చేయించాలి. మట్టితో బొమ్మలు చేయడం, సూదిలో దారం ఎక్కించడం, సొంతంగా ఆహారాన్ని తినడం, బొమ్మలతో పజిల్స్‌ పూర్తిచేయడం లాంటివి చేయిస్తూ ఉంటే ఏకాగ్రత కుదురుతుంది. చేసే పనికి తగ్గట్టు వేళ్లను కదిలించడం పిల్లలకు అలవాటవుతుంది. క్రమంగా చేతిరాత మెరుగవుతుంది.

  • పిల్లల చేత అక్షరాలను సరైన క్రమంలో దిద్దించాలి. తరవాత వాటిని వరుసలో రాయమని చెప్పాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే అక్షరాలు రాసే విధానం పిల్లలకు అర్థమవుతుంది. వాటిని అందంగా ఎలా రాయాలో తెలుస్తుంది. క్రమంగా పదాలు, వాక్యాలు రాయడాన్ని పిల్లలకు నేర్పించాలి.

  • వాక్యాలు రాసేటప్పుడు పదాల మధ్య చిన్న ఖాళీ ఉంచాలని పిల్లలకు చెప్పాలి. పదాలు రాసేటప్పుడు అక్షరాల సైజు ఒకేలా ఉండేలా సాధన చేయించాలి. రాయడానికి కష్టంగా ఉన్న పదాలను విడిగా పలుమార్లు రాయిస్తే పిల్లలు సులువుగా వాక్యాలు రాయగల్గుతారు. చేతిరాత కూడా పొందికగా మారుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్

ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్

For More AP News and Telugu News

Updated Date - Aug 04 , 2025 | 03:35 AM