Gold Purity Vheck: బంగారం కొంటున్నారా
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:03 AM
బంగారం స్వచ్ఛత, నాణ్యత విషయంలో మనకెన్నో అనుమానాలుంటాయి. 14, 18 క్యారెట్ల బంగారం కూడా 22 క్యారెట్ల బంగారంలాగే ధగధగలాడిపోతుంది. కాబట్టి మోసపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి...
అవగాహన
బంగారం స్వచ్ఛత, నాణ్యత విషయంలో మనకెన్నో అనుమానాలుంటాయి. 14, 18 క్యారెట్ల బంగారం కూడా 22 క్యారెట్ల బంగారంలాగే ధగధగలాడిపోతుంది. కాబట్టి మోసపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి బంగారం స్వచ్ఛతను నిర్థారించుకోవడం కోసం ఈ చిట్కాలు పాటించాలి.
అన్నిటికంటే ముఖ్యమైనది బిఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) హాల్‌మార్క్. బంగారం కొనేటప్పుడు, నగ మీద ఈ గుర్తు ఉండేలా చూసుకోవాలి. బంగారం స్వచ్ఛతను నిర్థారిస్తూ ప్రభుత్వం ధృవీకరించిన గుర్తు ఇది. 22 క్యారెట్ల బంగారం కోసం, 22కె916 అనే హాల్‌మార్క్ గుర్తు కోసం వెతకాలి. అంటే, ఈ నగ తయారీలో 91.6ు స్వచ్ఛమైన బంగారాన్ని ఉపయోగించారని అర్థం. ఈ గుర్తు అస్పష్టంగా ఉంటే, నాణ్యతను అనుమానించాల్సిందే! అలాగే 750 లేదా 18కె అనే గుర్తుత 18 క్యారెట్ల బంగారం నాణ్యతను సూచిస్తుంది. ఈ గుర్తుతో పాటు ఇంకొన్ని అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి.
లూమ్ నంబర్: వినియోగదారులు హాల్‌మార్కింగ్‌తో పాటు, జ్యువెలర్ల గుర్తింపు సంఖ్యను కూడా గమనించాలి. దీన్ని లైసెన్స్ లేదా లూమ్ నంబరు అని అంటారు. హాల్‌మార్క్ ఆభరణాల మీద ఈ నంబరు కూడా ముద్రించి ఉంటుంది. ఆభరణం మీద ఈ నంబరు ముద్రించి ఉంటే, సదరు జువెలర్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నమోదు చేసుకున్నారని అర్థం.
రసీదు: కొందరు విక్రేతలు వినియోగదారులను తప్పుదారి పట్టించడం కోసం నకిలీ హాల్‌మార్క్ స్టాంపులను ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి వినియోగదారులు వివరాలతో కూడిన రసీదును అడిగి తీసుకోవాలి. దాన్లో క్యారెట్ విలువ, బరువు, తయారీ రుసుము, ఇతరత్రా పన్నుల వివరాలు ఉండేలా చూసుకోవాలి.
బంగారం పరీక్ష: బంగారం నాణ్యతను నిర్థారించుకోవడం కోసం పేరున్న జ్యువెలర్స్ బంగారం నాణ్యతను, స్వచ్ఛతను వేగంగా, కచ్చితంగా నిర్థారించే సర్టిఫైడ్ గోల్డ్ టెస్టింగ్ మెషీన్స్‌ను అందిస్తున్నారు. కాబట్టి వాటిని ఆశ్రయించవచ్చు.
ఇవి కూడా చదవండి..
కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎన్నికల ఫలితాలు.. లాలూ కూతురి వరుస పోస్టులు..
లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.