Share News

Screen time : స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించాలంటే...

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:25 PM

మొబైల్‌తో ఎక్కువ సమయం గడపడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో డిజిటల్‌ స్ర్కీన్‌ టైమ్‌ పెరిగిపోయింది. దీంతో శారీరక, మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ స్ర్కీన్‌ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం!

Screen time : స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించాలంటే...

మొబైల్‌తో ఎక్కువ సమయం గడపడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో డిజిటల్‌ స్ర్కీన్‌ టైమ్‌ పెరిగిపోయింది. దీంతో శారీరక, మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ స్ర్కీన్‌ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం!

  • నోటిఫికేషన్‌ ఆప్షన్‌ను సెట్‌చేసి పెట్టుకోవడం వల్ల అవి వచ్చిన ప్రతిసారీ చేస్తున్న పనిని ఆపి మొబైల్‌ చూడాలనిపిస్తుంది. అందుకే పని పూర్తయ్యే వరకూ ఈ ఆప్షన్‌ను ఆపి ఉంచుకోవడం మంచిది. దీంతో ఏకాగ్రతగా పనిచేసుకోగల్గుతాం.

  • రంగులతో డిస్‌ప్లే ఉంటే తరచూ మొబైల్‌ చూడాలనిపిస్తుంది. అదే బ్లాక్‌ అండ్‌ వైట్‌ థీమ్‌లోకి మారిస్తే మనకు తెలియకుండానే మొబైల్‌ నుంచి ధ్యాస మళ్లుతుంది.

  • భోజనం చేసే సమయంలో, రాత్రి పడుకునేటప్పుడు మొబైల్‌ను సాధ్యమైనంత దూరంలో ఉంచాలి. కుటుంబ సభ్యులతో, చుట్టుపక్కలవారితో మాట్లాడుతూ ఉంటే మొబైల్‌ గుర్తుకు రాదు.

  • ప్రతి రోజూ కొంత సమయాన్ని డిజిటల్‌ బ్రేక్‌గా నిర్ణయించుకుని అనుసరించాలి. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప మొబైల్‌ను ముట్టుకోవద్దు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

  • రాత్రిపూట మొబైల్‌లో అలారం సెట్‌ చేయవద్దు. దీనికోసం గడియారాన్ని ఉపయోగించడం మంచిది. బెడ్‌రూమ్‌లో మొబైల్‌ ఫోన్‌ ఉంచవద్దు.

  • తరచూ వార్తాపత్రికలు, లేదా పుస్తకాలు చదువుతూ ఉంటే మొబైల్‌ చూసే అలవాటు నుంచి బయటపడవచ్చు. దీనివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.

  • సోషల్‌ మీడియా వాడకాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువగా రీల్స్‌, ఫొటోలు, మెసేజ్‌లు షేర్‌ చేసేవారిని మ్యూట్‌లో పెడితే కొంతవరకూ ప్రయోజనం ఉంటుంది.

  • ఇష్టమైన మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ నేర్చుకోవడం, మంచి పుస్తకాలు చదవడం, పిల్లలతో కలిసి ఆటలాడడం, వ్యాయామం చేయడం, ధ్యానం, నడక, గార్డెనింగ్‌ లాంటివి అలవాటు చేసుకుంటే డిజిటల్‌ స్ర్కీన్‌ టైమ్‌ని తగ్గించుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..

Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..

Updated Date - Feb 16 , 2025 | 11:25 PM