Hair Care Tips: శిరోజాల కొనలు ఇలా పదిలం
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:57 AM
కొంతమందికి శిరోజాల చివర్లు చిట్లిపోతుంటాయి. ఆపైన రంగుమారి నిర్జీవంగా కనిపిస్తుంటాయి. అలాకాకుండా శిరోజాలు నల్లగా మెరుస్తూ ఉండాలంటే...
కొంతమందికి శిరోజాల చివర్లు చిట్లిపోతుంటాయి. ఆపైన రంగుమారి నిర్జీవంగా కనిపిస్తుంటాయి. అలాకాకుండా శిరోజాలు నల్లగా మెరుస్తూ ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
చాలామంది శిరోజాలను స్టయిల్‌గా మార్చేందుకు స్ట్రయిట్‌నర్స్, కర్లర్స్ వాడుతూ ఉంటారు. వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వెంట్రుకల చివర్లు చిట్లిపోతుంటాయి. శిరోజాలను స్టయిల్ చేసుకోవడానికి బదులు చక్కగా దువ్వి జడ లేదా పోనిటెయిల్ వేసుకోవడం మంచిది.
శిరోజాలకు తగినంత తేమ అందకపోయినా చివర్లు చిట్లిపోతుంటాయి. మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. వారానికి రెండుసార్లు తలకు కొబ్బరినూనె రాసుకుంటూ ఉంటే వెంట్రుకల్లో తేమ నిలుస్తుంది.
రసాయనాలతో కూడిన షాంపూలు ఉపయోగించడం వల్ల కూడా శిరోజాలు చిట్లుతుంటాయి. మైల్డ్ షాంపూ లేదా కుంకుడుకాయ, మందారాకులతో తలస్నానం చేస్తుంటే సమస్య తీరుతుంది.
తలస్నానం చేసిన తరువాత శిరోజాలను తువాలుతో గట్టిగా రుద్దుతూ తుడవకూడదు. అలా చేయడం వల్ల జుట్టు చిక్కులు పడుతుంది. చిక్కులు తీయడానికి గట్టిగా దువ్వడం వల్ల వెంట్రుకల కొనలు చిట్లిపోతుంటాయి. కాబట్టి తలస్నానం తరువాత నీళ్లు ఇంకిపోయే వరకూ తలకు మెత్తని తువాలును చుట్టి ఉంచుకోవాలి.
శిరోజాలను బిగించి ముడి లేదా జడ వేయకూడదు. అలాగని జుట్టు విరబోసుకున్నా సమస్య పెరుగుతుంది. శిరోజాలు వదులుగా ఉండేలా అల్లుకోవాలి. దువ్వెనలు, దిండు కవర్లు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ పోషకాహరం తీసుకోవాలి.
శిరోజాల చివర్లు చిట్లినప్పుడు కొనలను మాత్రమే ట్రిమ్ చేయించుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest AP News And Telugu News