Share News

How to Stop Mouth Odor: నోటి దుర్వాసన పోవాలంటే

ABN , Publish Date - Jul 27 , 2025 | 03:40 AM

కొందరికి ఎప్పుడూ నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు, సరిగ్గా బ్రష్‌ చేయకపోవడం, కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం.. వంటి కారణాలు కూడా దుర్వాసనకు కారణం. దీనివలన...

How to Stop Mouth Odor: నోటి దుర్వాసన పోవాలంటే

కొందరికి ఎప్పుడూ నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు, సరిగ్గా బ్రష్‌ చేయకపోవడం, కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం.. వంటి కారణాలు కూడా దుర్వాసనకు కారణం. దీనివలన నలుగురిలో మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మరి ఈ దుర్వాసనను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..

  • దంతాల మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలను ఎప్పుటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

  • భోజనం తరువాత మర్చిపోకుండా నోటిని నీరుతో పుక్కిలించాలి. అలాగే రోజూ రెండుసార్లు పళ్లు తోముకోవాలి.

  • నోటి దుర్వాసనకు ప్రధాన కారణం బ్యాక్టీరియా. ఉప్పు నీటితో నోటిని పుక్కిలిస్తే ఆ బ్యాక్టీరియాను నిర్మూలించవచ్చు.

  • కొత్తిమీర, పుదీనా నమిలినా నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది.

  • బేకింగ్‌సోడాలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. దీనిని మౌత్‌వాష్‌గా ఉపయోగించినా మంచి ఫలితాలు ఉంటాయి.

  • యాపిల్‌, క్యారెట్‌, పుచ్చకాయ, పైనాపిల్‌ వంటి పళ్ల్లు నోటి దుర్వాసన తగ్గించడంలో బాగా సహాయపడతాయి.

  • నోరు పొడిబారడం కూడా దుర్వాసనకు కారణం. కాబట్టి తరచూ నీరు తాగుతూ నోరు ఆరిపోకుండా చూసుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 07:22 AM