Encourage Kids : పిల్లలు కూరగాయలు తినట్లేదా
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:01 AM
పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి తాజా కూరగాయలు ఎంతగానో దోహదం చేస్తాయి. కానీ వీటిని తినడానికి పిల్లలు అసలు ఇష్టపడరు. అలాంటప్పుడు పిల్లలచేత రకరకాల కూరగాయలను ఎలా తినిపించాలో తెలుసుకుందాం...
పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి తాజా కూరగాయలు ఎంతగానో దోహదం చేస్తాయి. కానీ వీటిని తినడానికి పిల్లలు అసలు ఇష్టపడరు. అలాంటప్పుడు పిల్లలచేత రకరకాల కూరగాయలను ఎలా తినిపించాలో తెలుసుకుందాం...
కీర, కేరట్, బీట్‌రూట్‌లను నక్షత్రాలు, హార్ట్, స్మైలీ ఫేస్ లాంటి ఆకర్షణీయమైన ఆకారాల్లో కోసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
కూరగాయల ముక్కలు లేదా వాటి తురుమును చేర్చి తయారుచేసిన ఇడ్లీ, దోశ, చపాతీలను పిల్లలకు తినిపించవచ్చు.
కూరగాయల ముక్కలు, కొత్తిమీర, పుదీనా చేర్చి రుచికరమైన స్ర్పింగ్‌రోల్స్ తయారుచేసి ఇస్తే పిల్లలు చక్కగా తింటారు.
పాలకూర, మెంతికూర లాంటి ఆకుకూరలను సన్నగా తరిగి గోధుమపిండిలో కలిపి తయారు చేసిన రోటీలను అల్పాహారంగా పిల్లలచేత తినిపించవచ్చు.
కూరగాయలను వండేటప్పుడు వాటిని శుభ్రం చేయడం, సన్నగా తరగడం, వండడం లాంటి పనులను పిల్లలతో కలిసి చేయాలి. క్రమంగా ఆ వంటకాలను తినాలనే ఆసక్తి పిల్లల్లో ఏర్పడుతుంది.
కుటుంబసభ్యులంతా కలిసి తరచూ వెజిటబుల్ సలాడ్‌ను తింటూ వుంటే పిల్లలకు కూడా దాన్ని తినాలనే కోరిక కల్గుతుంది.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం