Facial : పెరుగుతో ఫేషియల్...
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:27 PM
ముఖం అందంగా కనిపించాలని మహిళలు ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు. ప్రతిసారీ పార్లర్‌కి వెళ్లకుండా ఇంట్లో వుండే పెరుగుతో స్వయంగా ఫేషియల్ చేసుకుని ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం!
ముఖం అందంగా కనిపించాలని మహిళలు ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు. ప్రతిసారీ పార్లర్‌కి వెళ్లకుండా ఇంట్లో వుండే పెరుగుతో స్వయంగా ఫేషియల్ చేసుకుని ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం!
ముందుగా ముఖాన్ని సున్నిపిండితో శుభ్రం చేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు గంటెల పుల్లని పెరుగును తీసుకుని చెంచాతో బాగా కలిపి చిక్కని మిశ్రమంలా చేయాలి. దీనిని వేళ్లతో కొద్దిగా తీసుకుంటూ ముఖమంతా పట్టించి అయిదు నిమిషాలు సున్నితంగా మర్దన చేయాలి. పది నిమిషాల తరవాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చర్మానికి తగినంత తేమ అంది ముఖం మెరుపు సంతరించుకుంటుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్... నుదుటిపై ముడుతలు, గీతలు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేసి ముఖానికి సహజ కాంతిని అందిస్తుంది.
ఒక గిన్నెలో రెండు గంటెల పెరుగు, ఒక చెంచా కాఫీ పొడి, రెండు చెంచాల పంచదార వేసి కలపాలి. పెరుగులో పంచదార కరగడానికి ముందే ఈ మిశ్రమాన్ని వేళ్లతో ముఖమంతా పట్టించాలి. నుదురు, చెంపలు, ముక్కు భాగాల్లో కింది నుంచి పైకి వేళ్లతో సున్నితంగా రుద్దాలి. ఈ మిశ్రమం చక్కని స్క్రబ్‌లా పనిచేసి చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది. చర్మం మీద పేరుకున్న మృతకణాలన్నీ తొలగిపోతాయి. తరచూ ఇలా చేస్తూ ఉంటే ముఖం మీద బ్లాక్ హెడ్స్, మొటిమలు రావు. ఎండ వల్ల కలిగే నలుపుదనం కూడా తగ్గిపోతుంది.
చిన్న గిన్నెలో ఒక గంటె పెరుగు, ఒక గంటె టమాటా గుజ్జు వేసి బాగా కలపాలి. మెత్తని బ్రష్ సహాయంతో ముఖంపై కింది నుంచి పైకి దిశలో ఈ మిశ్రమాన్ని పట్టించాలి. కళ్ల మీద గుండ్రంగా తరిగిన టమాటా ముక్కలు పెట్టుకోవాలి. కళ్లు మూసుకుని అరగంట విశ్రాంతి తీసుకోవాలి. తరవాత చల్లని నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖం మీద చర్మం బిగుతుగా మారి నున్నగా ఆరోగ్యంగా కనిపిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..