ఇలా శుభ్రం చేయాలి
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:51 AM
మనం రోజూ ఉపయోగించే తువాళ్లు, దిండు గలీబులు, దుప్పట్ల మీద మురికితోపాటు హానికారక బ్యాక్టీరియాలు చేరుతూ ఉంటాయి. వాషింగ్ మిషన్‌లో వేసి ఉతికినప్పటికీ ఒక్కోసారి సరైన ఫలితం...
మనం రోజూ ఉపయోగించే తువాళ్లు, దిండు గలీబులు, దుప్పట్ల మీద మురికితోపాటు హానికారక బ్యాక్టీరియాలు చేరుతూ ఉంటాయి. వాషింగ్ మిషన్‌లో వేసి ఉతికినప్పటికీ ఒక్కోసారి సరైన ఫలితం కనిపించదు. వీటిని సులువుగా శుభ్రం చేసే చిట్కాల గురించి తెలుసుకుందాం...
కొంతమంది స్నానం చేసిన తరవాత తువాలును ఇతరత్రా కూడా వాడుతూ ఉంటారు. మధ్యలో ముఖం కడక్కున్నా చేతులు కడిగినా దానికే తుడిచేస్తుంటారు. రోజుల తరబడి ఇలా చేయడం వల్ల తువాలు పసుపు రంగులోకి మారి వాసన పడుతుంది. దీన్ని అలాగే వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక టబ్‌లో ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా లిక్విడ్ డిటర్జెంట్ వేసి రెండు మగ్గుల వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ నీళ్లలో రోజూ వాడే తువాలును అరగంటసేపు నానబెట్టాలి. తరవాత బ్రష్‌తో రుద్ది మంచినీళ్లతో ఉతికి ఎండలో ఆరేయాలి. పది రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే తువాలు శుభ్రంగా ఉంటుంది.
దిండు గలీబులు కూడా క్రమంగా జిడ్డు పట్టి నల్లగా మారుతుంటాయి. వీటివల్ల శిరోజాల సమస్యలు, ముఖం మీద మొటిమలు వస్తాయి. అలాకాకుండా వెడల్పాటి టబ్‌లో దిండు గలీబులను పరచి వాటిపై ఉప్పు చల్లాలి. తరవాత రెండు చెంచాల వెనిగర్‌ను, రెండు చెంచాల లిక్విడ్ డిటర్జెంట్‌ను చుక్కలు చుక్కలుగా వేసి రెండు మగ్గుల వేడి నీళ్లు పోయాలి. అరగంటసేపు అలాగే ఉంచాలి. తరవాత చేతులతో బాగా నలుపుతూ ఉతకాలి. చివరగా మంచినీళ్లలో ముంచి ఆరేయాలి. నెలకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే దిండు గలీబుల మీద మురికి, జిడ్డు పూర్తిగా వదిలిపోతాయి.
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక
రాష్ట్రపతుల పేర్లు తప్పుగా పలికిన ఖర్గే.. క్షమాపణకు బీజేపీ డిమాండ్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి