Beauty Tips: 40 దాటినా 20 ఏళ్ల బ్యూటీలా కనిపించాలనుకుంటున్నారా.. వీటిని ట్రై చేయండి..
ABN , Publish Date - Jan 16 , 2025 | 06:36 PM
సాధారణంగా మహిళలు తమ అందంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. చర్మ సంరక్షణ కోసం చాలా ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే, మీ చర్మాన్ని ఈ హోం రెమెడీస్‌తో మరింత యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుకోండి.

Beauty Tips: సాధారణంగా మహిళలు తమ అందంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. చర్మ సంరక్షణ కోసం రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కొంత మంది మహిళలు అందంగా కనిపించడం కోసం వేలకు వేలు కర్చు పెట్టి క్రీములు రాసుకుంటారు. ఒకవేళ మీకు 40 సంవత్సరాలు ఉంటే, మీ చర్మాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోండి. ఈ వయస్సులో ముడతలు, ఫైన్ లైన్స్ చాలా సాధారణం. కాబట్టి, 40 ఏళ్ల తర్వాత మహిళలు తమ ముఖానికి ఏమి రాసుకోవాలో తెలుసుకుందాం..
బొప్పాయి ఫేస్ ప్యాక్:
బొప్పాయి ఫేస్ ప్యాక్ మీ చర్మానికి చాలా మంచిది. బొప్పాయి ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయడం వల్ల 40 ఏళ్లు పైబడిన వారికి మేలు జరుగుతుంది. బొప్పాయిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని అనేక రకాల సమస్యల నుండి కాపాడతాయి. బొప్పాయి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో కూడా సహాయపడుతుంది. దీనితో పాటు, ముఖంపై ఉన్న నల్ల మచ్చలను సులభంగా తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మంపై ముడతలు కూడా తగ్గుతాయి.
పసుపు, పెరుగు పేస్ట్:
పసుపు, పెరుగు కలిపిన పేస్ట్‌ని చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇవి ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ ను తొలగిస్తాయి. అందాన్ని కూడా పెంచుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. మీరు ఈ పేస్ట్‌ను వారానికి 1-2 సార్లు ఉపయోగించవచ్చు. అలాగే పసుపు, పెరుగు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.
అలోవెరా జెల్:
అలోవెరా జెల్ చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వృద్ధాప్యంలో కలబందను ఉపయోగించడం మంచిది. అలోవెరా చర్మానికి తేమను అందించడంతో పాటు చర్మం పొడిబారడాన్ని కూడా తొలగిస్తుంది. కలబంద చర్మాన్ని కూడా హైడ్రేట్ చేస్తుంది. అలోవెరా జెల్‌ని రోజూ ముఖానికి రాసుకుంటే ముఖంపై వచ్చే వృద్ధాప్య లక్షణాలు తొలగిపోతాయి. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
సీరమ్ ఉపయోగించండి:
వృద్ధాప్యాన్ని నివారించడానికి మహిళలు 40 ఏళ్ల తర్వాత సీరమ్ వాడాలి. దీని కోసం మీరు రెటినోయిడ్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. ఇది చర్మంపై కొల్లాజెన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే, ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. కానీ, మీరు మీ చర్మ రకాన్ని దృష్టిలో ఉంచుకుని యాంటీ ఏజింగ్ సీరమ్‌ను ఎంచుకోవచ్చు.
సన్‌స్క్రీన్ ఉపయోగించడం మర్చిపోవద్దు: సాధారణంగా మహిళలు వయసు పెరిగే కొద్దీ సన్‌స్క్రీన్ ఉపయోగించడం మానేస్తారు. అయితే, 40 ఏళ్ల తర్వాత సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇది చర్మానికి చాలా మంచిదని కూడా భావిస్తారు. సన్‌స్క్రీన్ ఉపయోగించడం ద్వారా UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు. సన్‌స్క్రీన్ టానింగ్, మచ్చలను కూడా తొలగిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)