Share News

Home Remedies to Heal: పాదాలు పగులుతున్నాయా

ABN , Publish Date - Nov 12 , 2025 | 06:03 AM

శీతాకాలంలో చలిగాలుల వల్ల పాదాలమీద చర్మం పొడిబారి పగులుతుంటుంది. దీంతో తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. చిన్న చిట్కాలతో పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు....

Home Remedies to Heal: పాదాలు పగులుతున్నాయా

శీతాకాలంలో చలిగాలుల వల్ల పాదాలమీద చర్మం పొడిబారి పగులుతుంటుంది. దీంతో తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. చిన్న చిట్కాలతో పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల బియ్యప్పిండి, రెండు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా బాడీ వాష్‌, రెండు చెంచాల కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. శుభ్రం చేసుకున్న పాదాలమీద ఈ మిశ్రమాన్ని రాసి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో పాదాలను కడిగి పొడి గుడ్డతో తుడవాలి. ఆపైన ఏదైనా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే పగుళ్లు తగ్గి పాదాలు మృదువుగా మారతాయి.

  • పగుళ్ల మీద తేనె, కొబ్బరినూనె, షియా బటర్‌, ఆలివ్‌ ఆయిల్‌లలో ఒకటి రాసినా ప్రయోజనం కనిపిస్తుంది. ఇవి సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేసి పాదాలకు తేమని అందిస్తాయి. దీంతో పాదాల పగుళ్లు త్వరగా తగ్గుతాయి.

  • ఒక గిన్నెలో బాగా పండిన అరటి పండు గుజ్జు, అవకాడో గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రంచేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు మాయమవుతాయి.

  • వెడల్పాటి టబ్‌లో సగానికిపైగా గోరువెచ్చని నీళ్లు పోయాలి. అందులో ఒక చెంచా ఉప్పు, రెండు చెంచాల గులాబి నీళ్లు, రెండు చెంచాల గ్లిసరిన్‌ వేసి బాగా కలపాలి. అందులో రెండు పాదాలు మునిగేలా ఉంచాలి. అరగంట తరువాత పాదాలను స్క్రబ్‌ చేసి మంచినీళ్లతో కడగాలి. రెండు రోజులకోసారి ఇలా చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు తగ్గుతాయి.

  • ఒక గిన్నెలో గుప్పెడు తులసి ఆకులను పేస్టులా చేసి వేయాలి. అందులో రెండు చెంచాల కలబంద గుజ్జు, ఒక చెంచా కర్పూరం పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి పావుగంటసేపు మర్దన చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.

  • వెడల్పాటి గిన్నెలో తొమ్మిది చెంచాల నువ్వుల నూనె, మూడు చెంచాల వేపనూనె, ఒక చెంచా కలబంద గుజ్జు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా గంధం, ఒక చెంచా వేపాకుల పొడి వేసి బాగా కలపాలి. రాత్రి పడుకునేముందు ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి సాక్స్‌ వేసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే కాలి వేళ్లు, మడమల మీద ఏర్పడే పగుళ్లు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్

ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం

Updated Date - Nov 12 , 2025 | 06:03 AM