Share News

Healthcare Precautions: వీటితో కాలేయానికి కీడు

ABN , Publish Date - Sep 30 , 2025 | 03:17 AM

Hepatitis B and C Viruses Risk Factors and Precautions for Liver Damage

Healthcare Precautions: వీటితో కాలేయానికి కీడు

హెపటైటిస్‌

హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి వైర్‌సలు కాలేయాన్ని దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెడతాయి. వీటికి అడ్డుకట్ట వేసే టీకాలు, నివారణ చర్యల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.

ప్రధానంగా శరీర ద్రవాలు, రక్త మార్పిడిల ద్వారా హెపటైటిస్‌ బి, సి వైర్‌సలు సంక్రమిస్తాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, కాలేయంలోనే తిష్ఠ వేసుకుని, నెమ్మది నెమ్మదిగా కాలేయాన్ని దెబ్బ తీయడం మొదలుపెడతాయి. కొంత మందిలో ఈ వైర్‌సలు సమస్యను తీవ్రతరం చేసి, కామెర్లు, కాలేయ వైఫల్యానికి దారి తీస్తాయి. అయితే హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్లలో తీవ్రమైన లక్షణాలేవీ కనిపించవు. కాబట్టి ఈ వైర్‌సలు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ వైర్‌సలు సోకే కొన్ని ఇతరత్రా మార్గాలను మనందరం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అవేంటంటే..

టాటూల ద్వారా...

టాటూల ద్వారా హెపటైటిస్‌ వైర్‌సలు శరీరంలోకి చొరబడే ప్రమాదం ఉంది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడం కోసం, టాటూ వేయించుకునే స్టూడియోలో కఠినమైన పరిశుభ్రతా చర్యలు పాటిస్తున్నట్టు నిర్థారించుకోవాలి. నియంత్రణ లేని అనేక చిన్న పాటి పార్లర్లు, స్టెరిలైజ్‌ చేయని నీడిల్స్‌, పరికరాలను, కలుషిత ఇంకులను టాటూల కోసం ఉపయోగిస్తూ ఉంటాయి. కాబట్టి టాటూ వేయించుకునే ముందు ఆ ప్రదేశంలో పాటించే సురక్షిత ప్రమాణాల గురించి తెలుసుకోవాలి. ఉపయోగిస్తున్న సింగిల్‌ యూజ్‌ నీడిల్స్‌, ఇంక్స్‌ గురించి ఆరా తీయాలి.

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌


దంత చికిత్సల ద్వారా...

రక్తం అన్నివేళలా, అన్నిచోట్లా కళ్లకు కనిపించకపోవచ్చు. సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపించే వీలుండే మోతాదుల్లోని రక్తం పూర్తిగా స్టెరిలైజ్‌ చేయని సిరంజీలు, పరికరాలకు అంటుకుని ఉండొచ్చు.

సెలూన్లలో మ్యానిక్యూర్‌, పెడిక్యూర్‌, షేవింగ్‌ లాంటి సేవల ద్వారా వైరస్‌ కలిగిన రక్తం మన శరీరాల్లోకి చొరబడే వీలుంటుంది కాబట్టి పూర్తిగా స్టెరిలైజ్‌ చేసిన పనిముట్లనే ఆయా సేవల కోసం ఉపయోగించేలా చూసుకోవాలి. సింగిల్‌ యూజ్‌ షేవర్స్‌నే ఎంచుకోవాలి. పాతకాలపు పద్ధతిలో లోహపు బ్లేడ్స్‌ ఉపయోగాన్ని మానేయాలి. అలాగే దంత చికిత్సల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఆయా చికిత్సల్లో పూర్తిగా స్టెరిలైజ్‌ చేసిన పరికరాలే ఉపయోగించేలా చూసుకోవాలి.

డాక్టర్‌ ఆర్‌.వి. రాఘవేంద్ర రావు

డైరెక్టర్‌ అండ్‌ సీనియర్‌ సర్జికల్‌

గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌,

లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌,

రెనోవా - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌

గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్‌,

న్యూ ఎమ్‌ఎల్‌ఎ కాలనీ, రోడ్‌ నంబరు 12,

ఇవి కూడా చదవండి

పాపం ఈ అమ్మాయి.. రోడ్డుపై గుంత ప్రాణం తీసింది..

దేశంలోని విస్కీ అమ్మకాల్లో 58శాతం దక్షిణ భారతంలోనే

Updated Date - Sep 30 , 2025 | 03:17 AM