Guava: ఔషధాల నిధి... జామ
ABN , Publish Date - Mar 02 , 2025 | 05:03 AM
రోజుకి ఒక జామ కాయ తింటే అనారోగ్యం దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. అందరికీ అందుబాటులో ఉండే జామకాయలు తినడంవల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
జామకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సజావుగా జరిగేందుకు తోడ్పడుతుంది. మలబద్దకం రాకుండా చేస్తుంది.
మధుమేహం ఉన్నవారు... రోజుకి ఒక జామకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
జామకాయలో బి6, నియాసిన్ విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడుకి రక్తప్రసరణను పెంచుతాయి. ప్రతిరోజూ జామకాయలు తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
తరచూ జామకాయలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. దీంతో శరీరంలో వాతం, వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. జామలోని ఎ విటమిన్... కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
అల్పాహారంలో జామకాయను చేర్చుకుంటే గుండె జబ్బులు రావు. దీనిలోని పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
జామకాయను తరచూ తింటూ ఉంటే చర్మం తేమతో నిండి ఆరోగ్యంగా కనిపిస్తుంది. దీనిలోని సి విటమిన్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో ముఖం మీద మొటిమలు, గుల్లలు, ముడతలు రాకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సాయంత్రం వేళ జామకాయ ముక్కలు తింటే అలసట తీరుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జామలోని మెగ్నీషియం ప్రభావవంతంగా పనిచేసి రాత్రిపూట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.