Share News

Shiva Vishnu Unity: హరి హరుడు ఒకరేనా

ABN , Publish Date - Jul 25 , 2025 | 03:10 AM

హరుడు ఎవరు? హరి ఎవరు? వీరిద్దరూ ఒకప్పుడు ఒకటేనా? ఈ ప్రశ్న చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ సుమారు 1200 ఏళ్ల క్రితం మన దేశాన్ని రాష్ట్రకూటులు పాలిస్తున్న సమయంలో హరహరి మతం...

Shiva Vishnu Unity: హరి హరుడు ఒకరేనా

హరుడు ఎవరు? హరి ఎవరు? వీరిద్దరూ ఒకప్పుడు ఒకటేనా? ఈ ప్రశ్న చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ సుమారు 1200 ఏళ్ల క్రితం మన దేశాన్ని రాష్ట్రకూటులు పాలిస్తున్న సమయంలో - ‘హరహరి మతం’ అనేది ఒకటి దక్షిణ భారత దేశంలో పరిఢవిల్లింది. ఈ మతానికి చెందిన వారు ఆ ఇద్దరినీ సమానంగా కొలిచేవారు. వీరి దృష్టిలో హరి మన జీవితానికి ఆనందాన్ని ఇచ్చేవాడు. ఈ ప్రపంచంలో మనం ఆనందంగా ఎలా జీవించాలో చెప్పేవాడు. హరికి జీవిత భాగస్వామి ఉంది. కానీ కొన్ని కోణాలలో అతను సాధువు. హరుడు దీనికి పూర్తి వ్యతిరేకం. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలన్నీంటినీ తీర్చేవాడు శివుడు. ఏదైనా పెద్ద కష్టం వచ్చినా దానిని తనలోనే దాచుకోగలిగిన సమర్థుడు. కానీ అతను ప్రపంచమంతా తిరిగే జంగమ సాధువు. మనుషులకు దూరంగా సంచరిస్తూ ఉంటాడు. హరుడుకి కూడా జీవిత భాగస్వామి ఉంది. అంటే అతను జంగమ సాధువైన సంసారి.

ఈ రెండు వైరుధ్యాలు ఒక చోటకు చేరినప్పుడే ఒక సంపూర్ణ దైవం ఏర్పడుతుంది. వీరిద్దరూ ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాల వంటివారు. రాష్ట్రకూటుల కాలంలో.... దక్షిణ భారత దేశంలో ఈ సిద్ధాంతాన్ని అనుసరించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వియత్నాం, కంబోడియా మొదలైన దేశాలలో విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ఆ తరువాతి కాలంలో - హరి, హరుల కోసం ప్రత్యేకమైన శాఖలు ఏర్పడ్డాయి. ఈ మతానికి చెందిన వారు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకమైన పూజలేవీ నిర్వహించేవారు కారు. కాలక్రమేణా ఈ మతానికి ప్రాముఖ్యత తగ్గిపోయింది. అయితే ఈ రోజుకూ హర హరులను సమానంగా పూజించేవారు కొందరు మనకు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 03:11 AM