Indian Tea Habits: టీ తాగుదాం రండి
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:31 AM
చాలామంది గ్రీన్ టీ, బ్లాక్ టీ తాగుతుంటారు. వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు...
చాలామంది గ్రీన్ టీ, బ్లాక్ టీ తాగుతుంటారు. వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
బ్లాక్ టీ: వేడి వేడి టీ డికాషన్‌లో కొద్దిగా తేనె లేదా చక్కెర, కొద్దిగా నిమ్మరసం కలుపుతారు. దీన్లో థియోబ్రోమిన్, థియోఫిలిన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. రక్తపోటు, కార్డియోవాస్క్యులర్ వ్యాధుల్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నిర్మూలిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు.. క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. దీన్ని భోజన సమయంలో తాగకూడదు.
గ్రీన్ టీ: అంతగా ప్రాసెస్ చేయని తేయాకు పొడిని చిన్నచిన్న పేపర్ బ్యాగ్‌లలో నింపుతారు. కప్పు వేడి నీటిలో ఒక టీ బ్యాగ్ వేసి, ఆపైన కొద్దిగా తేనె, నిమ్మరసం, రెండు పుదీనా ఆకులు వేసి గ్రీన్ టీ చేస్తారు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి శరీరంలో పేరుకున్న టాక్సిన్లను బయటికి పంపుతాయి. చర్మ సౌదర్యానికి, శిరోజాల పెరుగుదలకు గ్రీన్ టీ దోహదం చేస్తుంది. గ్రీన్ టీని భోజనంతోపాటు తాగవచ్చు. రోజుకు రెండు కప్పులకు మించి తాగకూడదు.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం